వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలాంటి కంపెనీల కొనుగోలు, దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం: బ్రాహ్మణి

హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి తమ వ్యాపార విస్తరణ లక్ష్యాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి తమ వ్యాపార విస్తరణ లక్ష్యాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సొంత వ్యాపార విస్తరణ, అనుకూలంగా ఉన్న ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే డెయిరీ విభాగంలో దేశ వ్యాప్తంగా విస్తరించడానికి ఇటీవలే రిలయన్స్‌ రిటైల్‌కు చెందిన డెయిరీ వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు.

లక్ష్యాలను చేరుతోంది..

లక్ష్యాలను చేరుతోంది..

2022 నాటికి రూ.6,000 కోట్ల ఆదాయ స్థాయికి చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఏడాదికి 25 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తేనే ఈ లక్ష్యానికి కంపెనీ చేరుతుందని వార్షిక నివేదికలో బ్రాహ్మణి తెలిపారు.
మొత్తం ఆదాయంలో విలువ చేర్చిన ఉత్పత్తుల ఆదాయ వాటాను 24 శాతం నుంచి 40 శాతానికి పెంచుకోవాలని కంపెనీ భావిస్తోందని తెలిపారు.

Recommended Video

Nara lokesh again slipped his tongue - Oneindia Telugu
అవకాశాలు వదులుకోం..

అవకాశాలు వదులుకోం..

తమ కార్యకలాపాలను మరింత స్థిరీకరించుకునే ప్రక్రియను కొనసాగించడమే కాదు.. తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో తమకు అనుకూలంగా ఉండే వ్యాపారాల కొనుగోళ్ల అవకాశాలను అందిపుచ్చుకుంటామని బ్రాహ్మణి స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం..

దేశ వ్యాప్తంగా విస్తరిస్తాం..

సొంతంగా, కొనుగోళ్ల ద్వారా దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. మరింత గరిష్ఠంగా సామర్థ్యాల వినియోగంపై దృష్టి పెడతామని, విలువ చేర్చిన ఉత్పత్తుల శ్రేణిని పెంచుకోవడానికి కొత్త శ్రేణి ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురానున్నామని బ్రాహ్మణి వివరించారు.

లాభాలు ఆశా జనకం..

లాభాలు ఆశా జనకం..

కాగా, హెరిటేజ్.. గత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2,642.9 కోట్ల ఆదాయంపై రూ.66.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత నాలుగేళ్ల కాలంలో కంపెనీ వార్షిక సగటు ఆదాయ వృద్ధి రేటు 13.34 శాతం ఉంది. 2016-17 నాటికి కంపెనీ నికర విలువ (నెట్‌వర్త్‌) రూ.300 కోట్లు. నిల్వలు (రిజర్వులు) రూ.277 కోట్లకు చేరాయి. షేరుకు ఆర్జన (ఈపీఎస్‌) 2015-16లో రూ.23.89 ఉండగా.. గత ఆర్థిక సంవత్సరానికి రూ.28.80కు చేరింది.

English summary
When Nara Brahmani, daughter-in-law of Andhra Pradesh chief minister Chandrababu Naidu, joined family business Heritage Foods Ltd as executive director after completing her Masters in Business Administration from Stanford Graduate School of Business in 2013, the company’s sales growth was sliding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X