వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇంధన పొదుపులో హెరిటేజ్ సంస్థకు రెండోసారి అవార్డు వచ్చింది. గురువారం ఢిల్లీలో జరిగిన జాతీయ ఇంధన ఆదా సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు.

హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ఇంధన పొదుపులో ప్రతిభ కనబరిచిన పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.

Nara Brahmani Received NEC Award from the President of India Ramnath Kovind

గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ ఇంధన ఆదా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తదితరులు విచ్చేశారు.

అవార్డులకు ఎంపికైన సంస్థల ప్రతినిధులకు రాష్ట్రపతి, కేంద్రమంత్రి అవార్డులను ప్రదానం చేశారు. హెరిటేజ్ సంస్థ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న నారా బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా నారా బ్రాహ్మ‌ణి మాట్లాడుతూ... ఈ అవార్డు అందుకోవ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. హెరిటేజ్ సంస్థ‌కు ప‌దేళ్ల‌లో 8 సార్లు అవార్డు ద‌క్కిందని చెప్పారు. హెరిటేజ్ టీమ్ క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డంతోనే ఈ అవార్డు వ‌చ్చింద‌ని, త‌మ‌ సంస్థ పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల‌పై దృష్టి పెట్టిందని తెలిపారు. తాము ఎలక్ట్రికల్ సేవింగ్స్ ను 14.5% తగ్గించగలిగామని వివ‌రించారు.

English summary
Nara Brahmani, the Executive Director of Heritage Foods Limited received a prestigious NEC award here in Delhi from the President of India Ramnath Kovind on Thursday. Heritage Foods got this award second time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X