వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ది లీడర్.. అకస్మాత్తుగా అంత భారం, అందుకే కేబినెట్లోకి అఖిల, లోకేష్ కూడా..

ఏపీ మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ నారా లోకేష్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియలను తీసుకోనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుందని ప్రచారం జరుగుతోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ నారా లోకేష్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియలను తీసుకోనున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుందని ప్రచారం జరుగుతోంది.

యువతరం ప్రతినిధులుగా లోకేశ్, అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు దక్కనుందని అంటున్నారు. ఏపీ కేబినెట్‌లో ఇంత తక్కువ వయసు ఉన్న వారు మంత్రులుగా చేరడం ఇదే ప్రథమం కానుంది.

లోకేష్ కంటే అఖిల చిన్న

లోకేష్ కంటే అఖిల చిన్న

లోకేశ కన్నా అఖిల ఇంకా చిన్న వయస్కురాలు. చట్టసభలో మాత్రం ఆమె లోకేశ్ కన్నా సీనియర్‌. ఆమె 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆళ్ళగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లోకేశ్ ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు చంద్రబాబు ఇటీవల పార్టీ వర్గాల వద్ద సంకేతాలు ఇచ్చారని సమాచారం. తన తండ్రి భూమా నాగిరెడ్డి బతికి ఉన్నంతకాలం అఖిలప్రియ రాజకీయ వ్యవహారాలపై పెద్దగా దృష్టి సారించలేదు.

హఠాత్తుగా అఖిలప్రియపై మోయలేని భారం

హఠాత్తుగా అఖిలప్రియపై మోయలేని భారం

నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి ఆళ్ళగడ్డ వ్యవహారాలను కూడా ఎక్కువగా తానే చూసుకున్నారు. ఇప్పుడు అఖిల ప్రియపై పూర్తి భారం పడింది. ఇటీవల భూమా మరణంతో అఖిలప్రియపై ఒకేసారి మోయలేనంత బరువు పడింది. ఆళ్ళగడ్డతోపాటు తండ్రి నియోజకవర్గం నంద్యాలలో కూడా ప్రజల సమస్యలు, పార్టీ వ్యవహారాలు, తమ వర్గీయుల మంచి చెడూ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఖిలప్రియ కూడా ఈ పరిస్థితికి మానసికంగా సన్నద్ధమయ్యారు.

అఖిలలో నాయకత్వ లక్షణాలు

అఖిలలో నాయకత్వ లక్షణాలు

తండ్రి చనిపోయిన రెండు రోజుల్లోనే అసెంబ్లీలో జరిగిన సంతాప సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నమ్ముకున్న ప్రజల కోసం బాధను మరిచిపోతానని, నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తానని అఖిల ప్రకటించారు. ఇది సీఎం చంద్రబాబును, టిడిపి నేతలను ఆకట్టుకుంది. భూమా కుటుంబానికి ఇప్పుడు నాయకత్వ సమస్య లేదని, నాగిరెడ్డి లేని లోటును అఖిల పూడుస్తున్నారని టిడిపి భావిస్తోంది.

అఖిల ప్రియకు కేబినెట్లో ఛాన్స్

అఖిల ప్రియకు కేబినెట్లో ఛాన్స్

కాగా, మంత్రివర్గ విస్తరణలో అఖిలప్రియకు స్థానం ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. భూమా నాగిరెడ్డిని తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు గతంలో అనుకొన్నారు. ఆయన లేకపోవడంతో ఆ స్థానంలో అఖిలను తీసుకోవడం ఖాయమని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. భూమా మంత్రి కావాలని భావించారు. అయితే, తాను అయినా తన కూతురు అయినా పర్వాలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మూడోసారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు మంత్రివర్గంలో యువత కనిపించడం ఇదే ప్రథమం.

చంద్రబాబు నాడు చిన్న వయస్సులోనే..

చంద్రబాబు నాడు చిన్న వయస్సులోనే..

చంద్రబాబు అనేక మంది కొత్తవారికి అవకాశం కల్పించినా, ఇంత తక్కువ వయసు ఉన్నవారికి ఎప్పుడూ చోటు దక్కలేదు. కానీ చంద్రబాబు మాత్రం బాగా చిన్న వయసులోనే మంత్రి పదవిని పొందారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1981లో సీఎం అంజయ్య కేబినెట్లో మంత్రి అయ్యారు. అప్పటికి ఆయనకు పెళ్లి కూడా కాలేదు.

English summary
MLC Nara lokesh and MLA Akhila Priya will induct into AP CM Chandrababu Naidu's cabinet in next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X