వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నారు ..బీసీ నేత అచ్చెన్నాయుడుపై వివక్ష : లోకేష్,యనమల ఫైర్

|
Google Oneindia TeluguNews

టిడిపి సీనియర్ నాయకుడు,శాసనసభ పక్ష నేత,ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడంపై టిడిపి మండిపడుతోంది. అచ్చెన్నాయుడు గాయం మానక ముందే ఆయనను బలవంతంగా డిశ్చార్జి చేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. బీసీ నాయకులను వేధిస్తున్నారని, అచ్చెన్నాయుడు విషయంలో అదే జరుగుతుందని టీడీపీ ముఖ్యనాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ పై మండిపడిన చంద్రబాబు .. జైల్లో ఉంచాలనే సైకో మనస్తత్వంతో ఇలాఅచ్చెన్నాయుడు డిశ్చార్జ్ పై మండిపడిన చంద్రబాబు .. జైల్లో ఉంచాలనే సైకో మనస్తత్వంతో ఇలా

రాజకీయ ప్రత్యర్థులను వేధించటం కోసం అధికార దుర్వినియోగం

రాజకీయ ప్రత్యర్థులను వేధించటం కోసం అధికార దుర్వినియోగం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్నాయుడు బలవంతపు డిశ్చార్జ్ ను ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు రాజకీయ ప్రత్యర్థులను వేధించటం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. ఆపరేషన్ అయిన వ్యక్తిని 24 గంటలు రోడ్లపై తిప్పి మరోమారు ఆపరేషన్ జరగడానికి బాధ్యులు అయ్యారని నారాలోకేష్ విమర్శించారు.చేస్తున్న ప్రతి తప్పు జగన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు నారా లోకేష్.

అచ్చెన్నాయుడు విషయంలో పాశవికంగా, వివక్షపూరితంగా ప్రభుత్వ తీరు

అచ్చెన్నాయుడు విషయంలో పాశవికంగా, వివక్షపూరితంగా ప్రభుత్వ తీరు

టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాశవికంగా వివక్షపూరితంగా అచ్చెన్నాయుడు విషయంలో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక బీసీ నాయకుడిని కావాలని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వైద్యులను ప్రభుత్వం బెదిరించి డిశ్చార్జ్ చేయించిందని, ఆయన ఆరోగ్యం అసలే బాగాలేకున్నాబలవంతంగా ఆయనను తీసుకు వెళ్లారని మండిపడ్డారు.ఇది వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ చర్యగా యనమల ఫైర్ అయ్యారు. వీల్ చైర్ లో, అంబులెన్స్ లో కదలలేని స్థితిలో ఉన్న ఆయనను తీసుకుని వెళ్లడం ఆయన ఆరోగ్య పరిస్థితి అద్దం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

Happy Birthday Vijay: వీడు HERO ఏంటి అన్నారు..కానీ అతనే ఇప్పుడు SOUTH TOP HERO | Oneindia Telugu
300 కోట్ల అంబులెన్సుల కుంభకోణంలో దొరికినా విజయసాయిరెడ్డిపై చర్యలేవీ

300 కోట్ల అంబులెన్సుల కుంభకోణంలో దొరికినా విజయసాయిరెడ్డిపై చర్యలేవీ

అంబులెన్సుల కాంట్రాక్ట్ వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా విజయసాయి రెడ్డి పై ఎలాంటి విచారణ జరగలేదని మండిపడ్డారు. 300 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆధారాలు దొరికినా విజయసాయిరెడ్డి జోలికి ఎవరూ పోరని ఆయన పేర్కొన్నారు. రెడ్లకో అన్యాయం బీసీలకో న్యాయం అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి ఉందని యనమల విమర్శించారు. ప్రతి బీసీ నేత దీనిని ఖండించాలని పేర్కొన్న యనమల రామకృష్ణుడు అచ్చెన్నాయుడు విషయంలో ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

English summary
TDP National General Secretary Nara Lokesh condemned the forced discharge of Atchannaidu. He said in a tweet that Chief Minister Jagan Reddy is acting like a psycho. Nara Lokesh has blamed the abuse of power for harassing political opponents. Yanamala Ramakrishnudu fired that the government is acting in a very discriminatory manner on Atchannaidu a bc leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X