గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఆస్తులు రూ.3.73 కోట్లు: భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిల పేరిట ఆస్తులు ఇవే...

|
Google Oneindia TeluguNews

గుంటూరు: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు తమ కుటుంబ ఆస్తులను ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి చంద్రబాబు కుటుంబం ఆస్తులు ప్రకటిస్తుంది. లోకేష్ తమ కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

హెరిటేజ్ సంస్థ పదివేల మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. హెరిటేజ్ సంస్థకు ఈ ఏడాది చాలా అవార్డులు వచ్చాయన్నారు. నిన్ననే మా అమ్మ లండన్‌లో అవార్డు తీసుకుందన్నారు. ఇందుకు తమకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. గత 24 కష్టాల ఫలితం వల్ల ఈ అవార్డులు అన్నారు.

దేశంలో ఏ రాజకీయ కుటుంబం కూడా ఇప్పటి వరకు ఇలా ఆస్తులు ప్రకటించలేదన్నారు. ఆనాడు తన తండ్రి చిత్తూరు జిల్లా రైతుల కోసం హెరిటేజ్ స్థాపించారన్నారు. దేవుడి దయ వల్ల తాము ఈ స్టేజికి ఎదిగామని చెప్పారు. తన మామయ్య బాలకృష్ణ తమకు రూ.2 కోట్లకు పైగా ఇచ్చారని చెప్పారు. మీడియాకు ఆస్తుల వివరాల పుస్తకాన్ని అందించారు.

Nara Lokesh announces his family assets

చిత్తూరు డైరీపై..

చిత్తూరు డైరీని ముంచి చంద్రబాబు హెరిటేజ్‌ను అభివృద్ధి చేశారన్న ఆరోపణల పైన నారా లోకేష్ స్పందించారు. చిత్తూరు డైరీ 1992లో నష్టపోయిందన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులే దానిని సింగ్ చేశారన్నారు.

చంద్రబాబు కుటుంబం ఆస్తుల వివరాలు-

చంద్రబాబు పేరిట ఆస్తులు - రూ.3.73 కోట్లు
- హైదరాబాదులోని ఇల్లు విలువ 3.68కోట్లు
- అంబాసిడర్‌ కారు విలువ 1.52లక్షలు
- ఖాతాలోని నగదు రూ.3.59లక్షలు
- చంద్రబాబు పేరిట బ్యాంకు రుణం 3.06కోట్లు

భువనేశ్వరి ఆస్తులు - రూ.38.66 కోట్లు
- మొత్తం అప్పులు రూ.13 కోట్లు
- నికర ఆస్తులు రూ.24.84 కోట్లు
- పంజాగుట్టలో స్థలం రూ.73 లక్షలు
- తమిళనాడులో భూమి రూ.1.86 కోట్లు
- మదీనాగూడలోని భూమి- రూ.73 లక్షలు
- హెరిటేజ్‌ ఫుడ్స్‌లో వాటాలు- రూ.19.95 కోట్లు
- వివిధ కంపెనీల్లో వాటాలు- రూ.3.23 కోట్లు
- బంగారు అభరణాలు- రూ.1.27 కోట్లు
- కారు విలువ రూ.91 లక్షలు

లోకేశ్‌ పేరిట ఆస్తులు - రూ.14.50 కోట్లు
- అప్పులు రూ.6.35 కోట్లు
- నికర ఆస్తులు రూ.8.15 కోట్లు
- హెరిటేజ్‌ ఫుడ్స్‌లో వాటాలు రూ.2.52 కోట్లు
- ఇతర కంపెనీల్లోని వాటాలు రూ.1.64 కోట్లు
- కారు విలువ రూ.93 లక్షలు

బ్రాహ్మణి ఆస్తులు ఇవీ..
- మాదాపూర్‌లో భూమి- రూ.17 లక్షలు
- జూబ్లీహిల్స్‌లో నివాసం- రూ.3.50 కోట్లు
- చెన్నైలో వాణిజ్య స్థలం రూ.48 లక్షలు
- మణికొండలో స్థలం విలువ- రూ.1.23 కోట్లు

దేవాన్ష్‌ ఆస్తులివే..
- జూబ్లీహిల్స్‌లో ఇంటి విలువ- రూ.9.17 కోట్లు
- ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.2.4 కోట్లు
- నగదు నిల్వ రూ.2.31 లక్షలు

English summary
Telugudesam Party leader Nara Lokesh announces his family assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X