• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Mothers Day 2021: నారా లోకేష్‌లో కొత్త కోణం: అమ్మ భువనేశ్వరికి గ్రాండ్‌గా: కేక్ కట్

|

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. కొత్త కోణంలో కనిపించారు. సాధారణంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ ప్రభుత్వంలో చోటు చేసుకుంటోన్నాయని భావించే లోటుపాట్లపై తరచూ తనదైన శైలిలో విమర్శలను గుప్పిస్తూ కనిపిస్తుంటారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ, వారిపై జరిగే దాడులను ఎదుర్కొంటో.. వైసీపీ నేతల విమర్శలు, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పి కొడుతూంటారు. కిందటి నెల ముగిసిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ అభ్యర్థిని పనబాక లక్ష్మిని గెలిపించడానికి శ్రమించారు.

వైఎస్ జగన్, కేసీఆర్‌లపై జాయింట్‌గా: నిర్మలమ్మ కనికరం: పంచాయతీలకు భారీగా నిధులువైఎస్ జగన్, కేసీఆర్‌లపై జాయింట్‌గా: నిర్మలమ్మ కనికరం: పంచాయతీలకు భారీగా నిధులు

తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలను నిర్వహించారు. ప్రచారానికి సారథ్య బాధ్యతలను చేపట్టారు. ఆ ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోయింది. అయినప్పటికీ- తన ఓటు బ్యాంకును నిలపుకోగలిగింది టీడీపీ. ఉప ఎన్నిక అనంతరం నారా లోకేష్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసానికి పరిమితమయ్యారు. సోషల్ మీడియా ద్వారా ఏపీలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు, క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తోన్నారు.

Nara Lokesh celebtrates Mother’s Day 2021 along with his mom Bhuvaneshwari

అలాంటి నారా లోకేష్‌లో ఆదివారం ఓ కొత్త కోణం కనిపించింది. తాజాగా- ఆయన అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తన తల్లిదండ్రులు చంద్రబాబు, నారా భువనేశ్వరితో కలిసి మదర్స్‌డేను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. తన చేతులతో భువనేశ్వరికి కేక్ తినిపించారు. మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వేడుకలకు బయటి వ్యక్తులెవరినీ ఆహ్వానించలేదు.

  Balakrishna Emotional Video ఎటు చూసినా చావులే.. హిందూపురం ప్రజల కోసం బాలయ్య

  తన పేరెంట్స్‌తో నారా లోకేష్ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి మాత్రం కొడుకే అన్నట్లుగా నారా లోకేష్ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఆయన తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లల్లో పోస్ట్ చేశారు. ఆ కాస్సేపటికే ఇది వైరల్‌గా మారింది. ఈ కేక్‌పై 85 అనే అంకెలతో రూపొందించిన క్యాండిల్స్‌ను అమర్చారు. అదాయన పుట్టిన సంవత్సరాన్ని సూచిస్తోందని చెబుతున్నారు. నిజానికి నారా లోకేష్ పుట్టిన సంవత్సరం1983. ఈ ఫొటోలో చంద్రబాబు కనిపించీ కనిపించకుండా నిల్చున్నారు.

  English summary
  Telugu Desam Party leader and former minister Nara Lokesh celebtrates Mother’s Day 2021 along with his mom Bhuvaneswari at his residence in Hyderabad.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X