వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రుల మనోభావాలంటే జగన్‌కు లెక్కలేదు.. ఏపీ సీఎంపై లోకేశ్ నిప్పులు

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఏపీ రాజధానిపై జగన్ కుట్ర పన్నారని మండిపడ్డారు. ప్రజలు నిర్మించుకొంటున్న రాజధానిని .. కాదు అనే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ మేరకు జగన్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు నారా లోకేశ్. రాజధానిపై జగన్ వైఖరి సరికాదని .. కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

నేను కూడా ఫైన్ కట్టాను.. కొత్త మోటారు వాహన చట్టం ఫైన్‌లపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీనేను కూడా ఫైన్ కట్టాను.. కొత్త మోటారు వాహన చట్టం ఫైన్‌లపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలంటే సీఎం జగన్‌కు లెక్కలేదని విమర్శించారు లోకేశ్. తన సొంత ఇంటిని వందల కోట్లతో నిర్మించుకుంటారని .. అదే రాష్ట్ర ప్రజల కోసం అద్భుత రాజధాని మాత్రం అక్కర్లేదా అని ప్రశ్నించారు. అమరావతి రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో నెలరోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్నో లెటర్లు రాసిందని గుర్తుచేశారు. ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారం ఇచ్చారు. కానీ చివరి సెకనులో కూడా హెచ్చరించింది. కానీ వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని దుమ్మెత్తిపోశారు.

nara lokesh fire on ap cm jagan

అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకు ఎక్కడిదని లోకేశ్ ప్రశ్నించారు. మీ సొంత ఇళ్లను వందల కోట్లతో నిర్మించుకున్నారని .. అదే రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని నిర్మిస్తుంటే అక్కర్లేదు అన్నట్టు దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. అమరావతి రాజధానిపై జగన్ ప్రభుత్వ వైఖరి సరికాదని విమర్శించారు. ఇప్పటికైనా ఆలోచన మార్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలే ప్రభుత్వానికి బుద్దిచెబుతారని గుర్తుచేశారు.

English summary
TDP Leader Nara Lokesh fire on AP CM YS Jagan. Jagan's conspiracy against AP capital amaravathi. People are questioning where the capital they are building .. Nara Lokesh tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X