వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న ఆసరా ... ఇవ్వాళ టోకరా .. జనాలు బకరా : నారా లోకేష్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు .నిన్న ఆసరా , నేడు టోకరా, జనాలు బకరా అంటూ విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలను నిస్సిగ్గుగా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు నారా లోకేష్. కుడి చేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాగేసుకుంటామని నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.

వైఎస్సార్ ఆసరా పథకం పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా వేశారన్న మాజీ మంత్రి పీతల సుజాతవైఎస్సార్ ఆసరా పథకం పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా వేశారన్న మాజీ మంత్రి పీతల సుజాత

ఏపీలో సంక్షేమ కార్యక్రమాల అమలు పేరుతో ప్రజలపై పెను భారం మోపుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు నారా లోకేష్. ప్రజలపై ఇంత భారాన్ని మోపి దోచుకుందామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఒక్క జగన్ రెడ్డి మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు. గ్యాస్ పై 14.5 శాతం ఉన్న వ్యాట్ ను , 24.5 శాతానికి పెంచడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నిన్న ఆసరా పథకం ప్రారంభించి మహిళలకు మేలు చేసినట్లే చెప్పకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు మహిళలకు టోకరా వేశారని పేర్కొన్నారు.గ్యాస్ ధరలను పెంచి మహిళలపై మోపిన ఈ పెను భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అంటూ నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Nara Lokesh fire on ap government for increasing VAT on gas

మరోపక్క సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టుల అరెస్టులపై ,వేధింపులపై మండిపడ్డారు నారా లోకేష్. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఖాకీ స్వామ్యంలో ఉన్నామా అని హైకోర్టు వ్యాఖ్యానించిందని పేర్కొన్న నారా లోకేష్ రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు అంటూ ట్వీట్ చేశారు .జగన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం చాలా మంది అధికారులు ఖాకిస్టోక్రసీ , అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ఇలాగే చేసిన కొంతమంది అధికారులు జగన్ రెడ్డి గారితో కలిసి ఊచలు లెక్క పెట్టారన్నారు . ఇప్పుడు కూడా పత్రికా స్వేచ్ఛను హరించడానికి కూడా వెనకాడటం లేదు అంటూ మండిపడ్డారు లోకేష్ . కనీసం నోటీసు ఇవ్వకుండా జర్నలిస్టులకు అరెస్ట్ చేసి విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు.

English summary
Nara Lokesh criticized the AP govt for imposing a heavy burden on the people in the name of implementing welfare programs. He strongly condemned the increase in VAT on gas from 14.5 per cent to 24.5 per cent. Nara Lokesh demanded immediate lifting of raising gas pricies .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X