వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్ధంతిని జయంతి అంటే జరిగిన నష్టం ఏంటీ, అమెరికాలో ఉండటంతో వీక్, జగన్‌పై లోకేశ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

శాసనసభలో సభ్యుడి కానీ తన పేరును అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రస్తావించడం సరికాదని మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. సభలో సభ్యులు మంగళవారం తన పేరు ప్రస్తావించిన స్పీకర్ ఏమనకపోవడం ఆశ్చర్యమేసిందన్నారు. సభా సాంప్రదాయల ప్రకారం సభలో లేని వ్యక్తి గురించి చర్చొంచొద్దనే విషయం వైసీపీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. సభలో చంద్రబాబు తర్వాత తనపైనే వైసీపీ నేతలు విమర్శించారని పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో లోకేశ్ మీడియాతో మాట్లాడారు.

అమ్మాయిలతో లోకేశ్, 'కడుపుచేసే’ బాలకృష్ణ, టీడీపీ హయంలో సెక్స్ రాకెట్.. చంద్రబాబుపై రోజా ఫైర్ అమ్మాయిలతో లోకేశ్, 'కడుపుచేసే’ బాలకృష్ణ, టీడీపీ హయంలో సెక్స్ రాకెట్.. చంద్రబాబుపై రోజా ఫైర్

అమెరికాలో ఎడ్యుకేషన్

అమెరికాలో ఎడ్యుకేషన్

తాను పై చదువుల కోసం అమెరికా వెళ్లానని లోకేశ్ వివరించారు. దాదాపు ఎనిమిదేళ్లు అమెరికాలో ఉన్నానని గుర్తుచేశారు. బీటెక్ చేశాక వరల్డ్ బ్యాంక్‌లో జాబ్ చేశానని తెలిపారు. తర్వాత ఎంబీఏ చేసి ఇండియా తిరిగొచ్చానని తెలిపారు. తాను తెలుగులో తప్పు మాట్లాడటంతో జరిగిన నష్టం ఏంటి అని లోకేశ్ ప్రశ్నించారు. సీఎం జగన్ కూడా తెలుగు మాట్లాడటంలోనూ, లెక్కలోనూ వీక్‌గా ఉన్నారని గుర్తుచేశారు. ఈ విషయంపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

జరిగిన నష్టం ఏంటీ

జరిగిన నష్టం ఏంటీ

వర్దంతిని జయంతి అనడం వల్ల ఏపీకి జరిగిన నష్టం ఏంటి అని లోకేశ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయా అని అడిగారు. లేదంటే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా అని నిలదీశారు. అమరావతి పనులకు ఉన్న ఫలంగా ఏమైనా సమస్య వచ్చిందా అని లోకేశ్ వైసీపీ నేతలను అడిగారు. జరిగిన నష్టం ఏంటీ అని లోకేశ్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.

నీతులు చెబుతారా..?

నీతులు చెబుతారా..?

11 కేసులు ఉన్న జగన్ మోహన్ రెడ్డి 43 వేల కోట్ల ప్రజాధనం దోచారని అభియోగాలను ఎదుర్కొన్నారని లోకేశ్ గుర్తుచేశారు. సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేయడంతో దాదాపు 16 నెలలు జగన్ జైలులో ఉన్న విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు. ఇప్పుడు కడిగిన ముత్యంలా.. నీతులు చెబితే వినడానికి సిద్ధంగా ఎవరూ లేరన్నారు.

అవార్డులు కూడా

అవార్డులు కూడా

గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో చాలా పనులు చేపట్టామని వివరించారు. ఉపాధి హామీ పథకానికి ఏ రాష్ట్రం తీసుకురాని నిధులు తీసుకొచ్చామని చెప్పారు. 25 వేల కిలోమీటర్ల పరిధిలో సీసీ రోడ్లు నిర్మించామని చెప్పారు. వీధుల్లో ఎల్ ఈ డీ దీపాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థల నుంచి 53 అవార్డులు తీసుకున్నామని లోకేశ్ తెలిపారు.

మరి మీ సంగతి

మరి మీ సంగతి

తమ షేర్ల గురించే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందు తమ గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. రాజేంద్రనాథ్‌కు ఉన్న షేర్లు గురించి చెప్పాలని తెలిపారు. హెరిటేజ్ ప్రెష్‌ను తాము ఎప్పుడో అమ్మేశామని తెలిపారు. సాక్షి పత్రికను దొంగ పేపర్ అంటున్న జగన్.. దానిని రూ.7కు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. రూ.2కు విక్రయించొచ్చు కదా సూచించారు.

English summary
if iam not speak to telugu well what happened in andhra pradesh nara lokesh ask to ysrcp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X