విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విమర్శలు చేయడమేగా మీ పని: జగన్, పవన్‌పై లోకేష్, ‘మోడీ కనుసన్నల్లోనే వీరిద్దరు’

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ మంత్రి నారా లోకేష్.. జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్, వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వాళ్లకు విమర్శించడం తప్ప ఏమీ తెలియదని మండిపడ్డారు.
ఆటోనగర్‌లో ఎకరా స్థలంలో నిర్మించనున్న టీడీపీ జిల్లా కార్యాలయానికి లోకేశ్‌ భూమిపూజ చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర, ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణరావు, ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్‌, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం.. ఒక్క టీడీపీకే

ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం.. ఒక్క టీడీపీకే

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్నో విధాలుగా హింసించినా.. నమ్ముకున్న జెండాను విడిచిపెట్టని కార్యకర్తలే టీడీపీ బలమని వ్యాఖ్యానించారు. కార్యకర్తల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ.. కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా 3వేల మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.23కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

జగన్‌కు సవాల్

జగన్‌కు సవాల్

ఎన్నో కేసుల్లో నిందితుడైన వ్యక్తి.. తనపై ఆరోపణలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని జగన్‌కు సవాలు విసిరారు. పొరుగు జిల్లాలోనే పాదయాత్ర చేస్తూ.. కనీసం శ్రీకాకుళం జిల్లాలో తుఫాను కల్లోలిత ప్రాంతాలవైపు జగన్‌ కన్నెత్తి చూడలేదని గుర్తు చేశారు.

విమర్శలెందుకు పవన్.?

విమర్శలెందుకు పవన్.?

తుఫాను వచ్చిన ఏడు రోజులకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన పవన్‌.. ఏవో విమర్శలు చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు నేతలు ప్రజలకు సేవ చేయకపోవడమే కాక.. చేస్తున్న వారిని విమర్శిస్తారని దుయ్యబట్టారు మంత్రి లోకేష్.

మోడీ కనుసన్నల్లోనే జగన్, పవన్

మోడీ కనుసన్నల్లోనే జగన్, పవన్

ఇది ఇలా ఉండగా, శనివారం ఆయన శ్రీకాకుళంలో మంత్రి కిమడి కళా వెంకట్రావు కూడా జగన్, పవన్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్, జగన్‌లుప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని వెంకట్రావు అన్నారు. తుఫాను బాధితులను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోయినా జగన్, పవన్‌లు ఎందుకు అడగరని ప్రశ్నించారు. తాము విమర్శలను పట్టించుకోమని, ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యమని, కష్టాల్లో ఉన్న తుఫాను బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.

English summary
Andhra Pradesh minister Nara Lokesh on Saturday fired at YSRCP president YS Jaganmohan Reddy and Janasena president Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X