• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ గారూ.. రైతుల నోట్లో మట్టి కొట్టారు .. మీరు చేసిన పాపం మీకే రివర్స్ కొట్టిందిగా :నారా లోకేష్

|

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రానికి నష్టం తప్ప లాభం లేదని ఇప్పటికే టిడిపి భగ్గుమంటున్న విషయం తెలిసిందే. వైసిపి పాలనలో రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది అని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు పై పర్యావరణ నిబంధనల ఉల్లంఘన విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన కేంద్రం, ఇక తాజాగా పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై కూడా పర్యావరణ నిబంధనల ఉల్లంఘన విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా గ్రీన్ ట్రిబ్యునల్ పలు ఎత్తిపోతల పథకాలను ఆపివేయాలని ఆదేశాలు జారీ చెయ్యటంతో రాష్ట్రంలో ప్రాజెక్ట్ లపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

మున్సిపోల్స్ పై తెలంగాణా సర్కార్ కు హైకోర్టు ప్రశ్నల వర్షం ... విచారణ శుక్రవారానికి వాయిదా

జగన్ ప్రతిపక్షంలో ఉండగా తన మనుషుల చేత కేసులు వేయించిన ఫలితమే ఇది అని నారా లోకేష్ ఆగ్రహం

జగన్ ప్రతిపక్షంలో ఉండగా తన మనుషుల చేత కేసులు వేయించిన ఫలితమే ఇది అని నారా లోకేష్ ఆగ్రహం

ఇప్పుడు జగన్ సర్కార్ తీరుతో రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు ముందుకు కదలడం లేదు . అంతే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేయించిన పనితో, ప్రాజెక్ట్ లపై వేయించిన కేసులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టిడిపి నాయకులు. ఇక ఇదే విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి నారా లోకేష్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉండగా తన మనుషుల చేత కేసులు వేయించి గోదావరి- పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులు ఆపించారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు.

పలు ఎత్తిపోతల పథకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ కొరడా... జగన్ రైతుల నోటిలో మట్టికొట్టారని మండిపడిన లోకేష్

పలు ఎత్తిపోతల పథకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ కొరడా... జగన్ రైతుల నోటిలో మట్టికొట్టారని మండిపడిన లోకేష్

జగన్ తన చర్యలతో రైతుల నోటిలో మట్టికొట్టారని మండిపడ్డారు లోకేష్ . ప్రతిపక్షంలో ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం ఇప్పుడు రివర్స్ అయిందని, వైసిపి సర్కార్ కే పెద్ద తలనొప్పిగా మారిందని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన పలు ఎత్తిపోతల పథకాలపై గ్రీన్ ట్రిబ్యునల్ కొరడా ఝుళిపించిందని , గోదావరి -పెన్నా, పురుషోత్తపట్నం, చింతలపూడి పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసిందని ఓ పేపర్ క్లిప్పింగ్ ను జత చేసి నారా లోకేష్ ట్వీట్ చేశారు.

ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా వైయస్ జగన్ గారు? అని లోకేష్ ప్రశ్న

ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా వైయస్ జగన్ గారు? అని లోకేష్ ప్రశ్న

ఇక ట్వీట్ లో లోకేష్ "గోదావరి - పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులు ఆపించారు. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా వైయస్ జగన్ గారు? ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా... మీ మనుషుల చేత కేసులు వేయించి, రైతుల నోట్లో మట్టికొట్టేందుకు మీరు చేసిన అనేక కుట్రలకు ఇదొక నిదర్శనం". అని పేర్కొన్నారు. ఇక మరో ట్వీట్ లో ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే సామెత ఉందని, ప్రతిపక్షంలో ఉండగా మీరు చేసిన పాపం ఇప్పుడు మీకు ఎదురు కొట్టిందని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆపమంది కదా అని ప్రాజెక్టులను పక్కన పడేస్తే కుదరదని నారా లోకేష్ ప్రభుత్వానికి హెచ్చరించారు. అనుమతులు తెచ్చుకుని నిర్మాణం పూర్తి చేసి రైతులను ఆదుకునే బాధ్యత మీదే అని ఆయన తేల్చి చెప్పారు. చేసిన పాపం పడుకోక తప్పదంటూ లోకేష్ జగన్ కు సూచించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nara Lokesh was outraged that the sin committed while in the opposition has now been reversed Nara Lokesh tweeted with attaching a paper clipping, adding that the Green Tribunal has lashed out at several lift irrigation schemes in violation of environmental regulations and ordered to stop the Godavari-Penna, Purushottapatnam and Chintalapudi patti seema lift irrigation project
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more