వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి నారా లోకేష్‌కు స్కోచ్ టెక్నాలజీ అవార్డు, పంచాయతీరాజ్‌కు ఐదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు స్కోచ్ అవార్డులు వచ్చాయి. పంచాయతీరాజ్ శాఖ మొత్తం అయిదు అవార్డులు సాధించింది.
అలాగే స్కోచ్ టెక్నాలజీ కేటగిరీలో మంత్రి నారా లోకేష్‌కు అవార్డు వచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డ్యాష్ బోర్డు, బ్లూ ఎకానమీ కేటగిరిలో జలవాణి కాల్ సెంటర్, ఎన్టీఆర్ జలసిరి, ఐవోటీ ద్వారా ఎల్ఈడీ లైట్ల పర్యవేక్షణకు మొబిలిటీ అవార్డులు వచ్చాయి.

ఆర్ఎఫ్ఐడి కార్డు ద్వారా చెత్త సేకరణ పథకానికి అవార్డు దక్కింది. ఇదిలా ఉండగా అవార్డులు సాధించేందుకు కృషి చేసిన అధికారులు మంత్రి లోకేష్‌కు అభినందనలు తెలిపారు.