కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్విస్ట్.. కర్నూలు రెండో రాజధానిగా ఓకే, కానీ: బీజేపీకి లోకేష్ దిమ్మతిరిగే షాక్

|
Google Oneindia TeluguNews

అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమను నిర్లక్ష్యం చేస్తోందని, కర్నూలును రెండో రాజధాని చేయాలన్న సీమ బీజేపీ నేతల తీర్మానం, డిమాండ్‌పై మంత్రి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కర్నూలు రెండో రాజధానికి తమకు అభ్యంతరం లేదని చెప్పారు.

చదవండి: మనోడే ప్రధాని.. మళ్లీ కేసీఆర్ సెంటిమెంట్: థర్డ్ ఫ్రంట్-కొత్త కోణాలు! ఢిల్లీలో చక్రం ఖాయం

Recommended Video

Budget Session updates : Watch TDP protests for AP special status

అభ్యంతరం లేదని చెప్పిన లోకేష్ అక్కడే ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీ నాయకుల డిమాండుతో తాను ఏకీభవిస్తున్నానని, కానీ దేశానికి రెండో రాజధానిగా కర్నూలును చేయాలని కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు.

అన్యాయం చేశారు, ఇంకా ఇవన్నీ రావాలి, రాజధాని లేకపోవడంతో: బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్అన్యాయం చేశారు, ఇంకా ఇవన్నీ రావాలి, రాజధాని లేకపోవడంతో: బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్

ఈ డిమాండ్ ఎప్పటి నుండో ఉంది

ఈ డిమాండ్ ఎప్పటి నుండో ఉంది

దక్షిణ భారత దేశానికి రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని నారా లోకేష్ చెప్పారు. ఆ దేశ రెండో రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేస్తే రాయలసీమ బీజేపీ నేతలు కోరుకున్నది జరుగుతుందని దిమ్మతిరిగే షాకిచ్చారు. అప్పుడు మనమంతా కోరుకున్నది కూడా జరుగుతుందన్నారు.

అమరావతిని కట్టేందుకే ఇబ్బందులు

అమరావతిని కట్టేందుకే ఇబ్బందులు

ఓ వైపు రాష్ట్రానికి రాజధాని అమరావతిని కట్టుకోవడానికే నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని, అలాంటిది కర్నూలులో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పడంలో అర్థం ఉందా అని లోకేష్ మండిపడ్డారు. రాయలసీమ డిక్లరేషన్ ఇప్పుడు అప్రస్తుతమని చెప్పారు.

రూ.5లక్షల కోట్లని బాబు అంటే ఎగతాళి చేశారు

రూ.5లక్షల కోట్లని బాబు అంటే ఎగతాళి చేశారు

ఢిల్లీ కంటే మంచి రాజధానిని ఏపీ ప్రజలకు కడతామని ప్రధాని మోడీ చెప్పారని లోకేష్ అన్నారు. హైదరాబాద్ వంటి మహా నగరాన్ని నిర్మించేందుకు రూ.5 లక్షల కోట్లు కావాలని గతంలో చంద్రబాబు అంటే ఎగతాళి చేశారని, ఆయన మాటల విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తోందన్నారు.

వైసీపీతో లాభం లేదు

వైసీపీతో లాభం లేదు

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని 19 అంశాలు నెరవేర్చాలని, ఆ బాధ్యత కేంద్రంపై ఉందని నారా లోకేష్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లపై నడుస్తున్న ప్రతిపక్ష నేత జగన్ అదే ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఎంపీ పదవులకు వైసీపీ రాజీనామా చేయడంలో అర్థం లేదన్నారు. సభలో ఉండి విభజన హామీలకు పట్టుబట్టాలన్నారు.

టీఆర్ఎస్, బీజేపీతో పొత్తుపై

టీఆర్ఎస్, బీజేపీతో పొత్తుపై

తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తుపై చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి పొత్తులపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఏపీలో కూడా బీజేపీతో స్నేహం సంగతి అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.

English summary
Andhra Pradesh IT minister Nara Lokesh said on Monday that NDA government should consider Kurnool as India's second capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X