వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ట్వీట్లతో నారా లోకేష్ మళ్ళీ బుక్కయ్యాడుగా ... నెటిజన్లు ట్రోలింగ్స్ మొదలెట్టేశారుగా

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రి ఏపీ సీఎం తనయుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ లు మరోమారు నారా లోకేష్ టార్గెట్ అయ్యేలా చేశాయి. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక తప్పు దొరుకుతుంది. అది బాగా హైలెట్ అవుతుంది. తాజాగా మరోసారి తన ట్వీట్లతో లోకేష్ ట్రోల్స్ కు గురవుతున్నారు.

గ‌రుడ శివాజీ ఎక్క‌డ..ఎన్నిక‌ల త‌రువాత‌ : ఛీటింగ్‌ వ్య‌వ‌హారం: సీబీఐ ద‌ర్యాప్తున‌కు డిమాండ్..!గ‌రుడ శివాజీ ఎక్క‌డ..ఎన్నిక‌ల త‌రువాత‌ : ఛీటింగ్‌ వ్య‌వ‌హారం: సీబీఐ ద‌ర్యాప్తున‌కు డిమాండ్..!

సాంకేతిక దినోత్సవం సందర్భంగా నారాలోకేష్ ట్వీట్లు

సాంకేతిక దినోత్సవం సందర్భంగా నారాలోకేష్ ట్వీట్లు

సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆయన ఆదివారం నాడు ట్విట్టర్‌లో కొన్ని ట్వీట్స్ చేశారు. ఇక ఆ ట్వీట్లే లోకేష్ కు చిక్కులు తెచ్చి పెట్టాయి. ఏపీని సాంకేతికంగా అభివృద్ధి చెయ్యటం గురించి ట్వీట్ చేసిన లోకేష్ తండ్రి చంద్రబాబు వల్లే ఏపీలో సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిందని కితాబిచ్చారు . ఇక ఆ ట్వీట్లే లోకేష్ బాబు కొంప ముంచింది.

ఏపీలో సాంకేతికత అభివృద్ధి చెందటానికి చంద్రబాబు కారణం అని కితాబిచ్చిన లోకేష్

ఏపీలో సాంకేతికత అభివృద్ధి చెందటానికి చంద్రబాబు కారణం అని కితాబిచ్చిన లోకేష్

ఇక ఆయన పోస్ట్ చేసిన ట్వీట్లు చూస్తే ‘ఈరోజు జాతీయ సాంకేతికతా దినోత్సవం. శాస్త్ర, సాంకేతికత ఫలాలను సామాన్యుల జీవితాల్లోకి తీసుకువెళ్ళాలన్న చంద్రబాబుగారి ఆకాంక్షలకు అనుగుణంగా గత ఐదేళ్ళలో ప్రభుత్వ శాఖలన్నింటా సాంకేతిక వినియోగాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడం జరిగింది' అని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా తండ్రి గొప్పతనం తెలియ జేయాలన్న ఆకాంక్షతో మరో రెండు ట్వీట్లు చేశారు. ‘ఇవిగాక ఫిన్ టెక్, బ్లాక్ చైన్, డేటా సెంటర్ వంటి అధునాతన సాంకేతికతను అందించే పరిశ్రమలను ఏపీకి తేవడం జరిగింది. మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ అందించే ఫైబర్ గ్రిడ్ ఒక విప్లవాత్మక ప్రాజెక్టు.' అని మరో ట్వీట్ చేశారు.అంతేకాదు ‘సామాన్యులు ఎదుర్కునే సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపినప్పుడే సాంకేతికతకు సార్థకత. అందుకే చంద్రబాబుగారు పౌర సరఫరాల శాఖ నుంచి వ్యవసాయ రంగం వరకు సాంకేతిక వినియోగాన్ని పెంచారు' అంటూ తండ్రి చంద్రబాబుకు కితాబిస్తూ ట్వీట్ చేశారు.

సాంకేతికతను కనిపెట్టింది చంద్రబాబు అని చెప్పకపోయావా అంటూ లోకేష్ పై ట్రోల్స్

సాంకేతికతను కనిపెట్టింది చంద్రబాబు అని చెప్పకపోయావా అంటూ లోకేష్ పై ట్రోల్స్

దీంతో లోకేష్ ట్వీట్లపై నెటిజన్లు కామెంట్లు మొదలు పెట్టారు. కాలానుగుణంగా సాంకేతికత పెరుగుతూ ఉంటె అంతా చంద్రబాబు వల్లే అని చెప్తారా అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు. ఇంకెందుకు సాంకేతికను, శాస్త్రవిజ్ఞానాన్ని కనిపెట్టింది కూడా చంద్రబాబుగారేనని చెప్పుకపోయావా అంటూ లోకేష్‌ పై సెటైర్లు వేస్తున్నారు. ఇలా లోకేష్ బాబు మారో మారు తాను చేసిన ట్వీట్ల వల్ల నెటిజన్ల ట్రోల్స్ కు గురవుతున్నారు.

English summary
AP minister and AP CM chandrababu's son Nara Lakesh posts on Twitter platform and once again Nara Lokesh targeted. During the day of technology, he made some tweets on Twitter on Sunday. The tweets were loaded with locks. AP CM Chandrababu is the reason for the AP development of technology lokesh tweeted, but he was trolled and setaired saying that the technoloy is invented by Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X