కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్! దమ్ముందా: నారా లోకేష్, మరోసారి నోరు జారిన మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

మరోసారి నోరు జారిన నారా లోకేష్

కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని మంత్రి నారా లోకేష్ మంగళవారం సవాల్ చేశారు. ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ, ప్రత్యేక ఉత్తరాంధ్ర పేరుతో పవన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాను, అందుకే అభిమాన సంస్థ పెట్టలేదు: చిరంజీవి ఫ్యాన్స్‌తో పవన్క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాను, అందుకే అభిమాన సంస్థ పెట్టలేదు: చిరంజీవి ఫ్యాన్స్‌తో పవన్

ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాట్లాడుతూ మరోసారి తడబడ్డారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు. ఆ వీడియోను చూస్తే ఓ మాట అనబోయి మరొకటి అన్నట్లుగా కనిపిస్తోంది.

ఎన్టీఆర్‌ను సీఎం చేసిన ఘనత ఇందిరాగాంధీది

ఎన్టీఆర్‌ను సీఎం చేసిన ఘనత ఇందిరాగాంధీది

కర్నూలు జిల్లాలో సోమవారం పర్యటించిన లోకేష్ బ్రాహ్మణకొట్కూరులో మాట్లాడారు. ఆనాడు ఫుల్ మెజార్టీ ఉన్నా అన్నగారిని (ఎన్టీఆర్) దింపితే (అధికారం నుంచి) తెలుగు ప్రజలు గర్చించారని చెప్పారు. ఆ గర్జనను తట్టుకోలేక మళ్లీ మన అన్నగారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరా గాంధీదేనని లోకేష్ వ్యాఖ్యానించారు.

 లోకేష్ తడబాటు

లోకేష్ తడబాటు

ఆ గర్జనను తట్టుకోలేక ఇందిరాగాంధీ తలొగ్గిందనే వ్యాఖ్యలు చేయబోయి, ముఖ్యమంత్రిగా చేసిన ఘనత ఇందిరాగాంధీదే అని వ్యాఖ్యానించినట్లుగా కనిపిస్తోంది. దీనిని పట్టేసిన వారు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. గతంలో వర్ధంతిని జయంతి, అవినీతిలో ఏపీ ముందు వరుసలో ఉందని పొరపాటుగా వ్యాఖ్యానించారు.

ప్రజల్లోకి నారా లోకేష్

ప్రజల్లోకి నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి శ్రేణులను సమాయత్తం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయనున్నారు.

నేతల మధ్య సర్దుబాట్లు

నేతల మధ్య సర్దుబాట్లు

నారా లోకేష్ రాష్ట్ర పర్యటన ప్రారంభమైంతే వారంలో మూడు ోజులు అధికారిక కార్యక్రమాలు, మరో మూడు రోజులు పర్యటనలు చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ పర్యటన ద్వారా జిల్లా నేతలతో సమావేశమై లోటుపాట్లను సరిదిద్దనున్నారు. రానున్న రెండు మూడు నెలల్లో తొలి విడత పర్యటన పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు.

English summary
Andhra Pradesh Minister and TDP leader Nara Lokesh lashes out at Jana Sena chief Pawan Kalyan, demand to prove allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X