వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై లోకేష్ ఫైర్: 'తప్పుడు మెయిల్స్‌తో అమెరికా పోలీసుల తిప్పలు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ‌పై, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు సోమవారం భగ్గుమన్నారు. మంత్రులు నారా లోకేష్, పరిటాల సునీత, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావులు నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ‌పై, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నేతలు సోమవారం భగ్గుమన్నారు. మంత్రులు నారా లోకేష్, పరిటాల సునీత, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావులు నిప్పులు చెరిగారు.

చంద్రబాబుపై అమెరికా మేయర్‌కు వైసిపి షాకింగ్ మెయిల్?చంద్రబాబుపై అమెరికా మేయర్‌కు వైసిపి షాకింగ్ మెయిల్?

అమెరికాలో చంద్రబాబుపై ఫిర్యాదు అంశం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై నారా లోకేష్ స్పందించారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్న చంద్రబాబుపై అంతర్జాతీయ వేదిక సాక్షిగా జగన్ కుటిల రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

Nara Lokesh lashes out at YS Jagan over America mail issue

రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలనే ఉద్దేశ్యం జగన్‌కు ఏమాత్రం లేదని లోకేష్ చెప్పారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు చంద్రబాబు అమెరికా వెళ్తే, నిధుల కోసం వెళ్లారని తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. ప్రతిపక్షం నీచ రాజకీయాలు మాని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నారు.

తప్పుడు మెయిల్స్ పంపిన జగన్ క్షమాపణ చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ డిమాండ్ చేశారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి జగన్ అన్నారు. జగన్ 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీశారన్నారు. తప్పుడు మెయిల్స్‌తో అమెరికా పోలీసులను తప్పుదోవ పట్టించారన్నారు. జగన్ అధికార దాహంతో దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారు.

English summary
Minister Nara Lokesh lashes out at YSR Congress Party chief YS Jagan over America mail issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X