విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవినాశ్‌కు నారా లోకేష్ హామీ: దేవినేని నెహ్రూకు నాడు చంద్రబాబు హామీ!

దేవినేని నెహ్రూ కుటుంబ సభ్యులను మంత్రి, టిడిపి యువనేత నారా లోకేష్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్‌కు లోకేష్ హామీ ఇచ్చారు. మీ కుటుంబ సభ్యులకు, నీకు అండగా ఉంటామని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: దేవినేని నెహ్రూ కుటుంబ సభ్యులను మంత్రి, టిడిపి యువనేత నారా లోకేష్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్‌కు లోకేష్ హామీ ఇచ్చారు. మీ కుటుంబ సభ్యులకు, నీకు అండగా ఉంటామని చెప్పారు.

అవినాశ్‌ను ఎమ్మెల్యేగా చూడాలనుకున్న నెహ్రూ: బోరుమన్న లక్ష్మీప్రసన్నఅవినాశ్‌ను ఎమ్మెల్యేగా చూడాలనుకున్న నెహ్రూ: బోరుమన్న లక్ష్మీప్రసన్న

మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని నెహ్రూ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని మంత్రులు చినరాజప్పతో కలిసి నారా లోకేష్ పరామర్శించారు.

గుణదలలోని నెహ్రూ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నారా లోకేష్ వెంట ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్‌, గద్దె రామ్మోహన్‌ రావు, ఎంపీ కేశినేని నాని, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.

కొడుకు కోసం దేవినేని ప్రయత్నాలు

కొడుకు కోసం దేవినేని ప్రయత్నాలు

దేవినేని నెహ్రూ కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజకీయంగా బెజవాడలో మంచి పట్టు ఉంది. అయితే, అనారోగ్యం కారణంగా తన తర్వాత తన కొడుకును రాజకీయ వారసుడిగా ప్రకటించాలని భావించారు. ఇందుకోసం గత ఒకటి రెండేళ్లుగా అవినాశ్‌ను తెరపైకి తీసుకు వచ్చారు.

చంద్రబాబు హామీ మేరకు..

చంద్రబాబు హామీ మేరకు..

దేవినేని అవినాశ్‌కు మంచి రాజకీయ జీవితం ఇచ్చేందుకు దేవినేని నెహ్రూ ప్రయత్నించారు. ఇందుకోసం సీఎం నారా చంద్రబాబు నాయుడుతో దేవినేని నెహ్రూ గతంలోనే మాట్లాడారని, ఆయన హామీ మేరకే టిడిపిలో చేరారని చెబుతారు. కొడుకు భవిష్యత్తు కోసమే సైకిల్ ఎక్కారని అంటారు.

దేవినేని నెహ్రూ మృతి తర్వాత..

దేవినేని నెహ్రూ మృతి తర్వాత..

దేవినేని నెహ్రూ మృతి నేపథ్యంలో.. ఆయనకు ఇచ్చిన హామీని చంద్రబాబు నెర్వేర్చాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్.. అవినాశ్‍‌కు ఇప్పటికి రెండుమూడుసార్లు ధైర్యం చెప్పారు. అన్నింటా నెహ్రూ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. తద్వారా రాజకీయంగా కూడా అండగా ఉంటామని చెబుతున్నారు.

ఇచ్చిన హామీ మేరకు..

ఇచ్చిన హామీ మేరకు..

కొద్ది రోజుల క్రితం మంత్రివర్గ విస్తరణలో పలువురు నేతలకు చోటు దక్కలేదు. వైసిపి నుంచి వచ్చిన వారికి మాత్రం మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. దీనిపై తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు పలువురు చంద్రబాబును ప్రశ్నించారు.

దానికి చంద్రబాబు మాట్లాడుతూ.. మనం హామీ ఇవ్వడంతో ఇతర పార్టీ నేతలు వచ్చారని, పార్టీ బలపడుతుందని, కాబట్టి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, పార్టీ కోసం కొన్ని తప్పదని చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Telugudesam Party seniror leader Nara Lokesh on Wednesday met Devineni Avinash in Gunadala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X