వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జప్ఫాలు... This is వాస్తవం.. ఆ పాపం వూరికే పోదు : నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి నారా లోకేష్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . నారావారి పల్లెలో జరిగిన బహిరంగ సభకు ఎవరూ రాలేదని పేర్కొన్నారు. జనం మాత్రం కనిపించలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ కొన్ని వీడియోలతో పాటు, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో ఈ క్రమంలోనే ఆ సభకు సంబంధించిన విజువల్స్ , ఫోటోలు పోస్టు చేశారు నారా లోకేష్. ఇక అంతే కాదు 'జప్ఫాలు... This is వాస్తవం' అంటూ కాస్త వెటకారం కూడా జోడించి వైసీపీపై విమర్శలు గుప్పించారు నారా లోకేష్ .

మూడు రాజధానులపై చంద్రబాబు ఇలాకాలో వైసీపీ భారీ బహిరంగ సభను నిర్వహించి సక్సెస్ అయ్యామని చెప్తుంటే అధికార పార్టీకి అంత సీన్ లేదు ఆ సభకు జనమే రాలేదని టీడీపీ ఎద్దేవా చేస్తుంది. సభకు జనాలే రాలేదని, కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయని సభ విఫలం అని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏకంగా వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Nara lokesh outraged on YCP and CM Jagan mohan reddy

ఇక అంతేకాదు ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఒక్క అవకాశం ఇస్తే.. ఎన్ని కష్టాలో, నష్టాలో, అనర్థాలో అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. చివరకు అవ్వా, తాతలను కూడా వదలలేదని, పండు టాకులకు పెన్షన్ తీసేసిన పాపం ఊరికే పోదంటూ జగన్ పై మండిపడిన లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ తో పాటు ఓ వీడియోను కూడా జతపరిచారు. పెన్షనే తనకు ఆధారం అని, అది లేకుండా చేశారంటూ ఓ వృద్ధురాలు తన ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ను లోకేష్ పోస్ట్ చేశారు .

English summary
Nara Lokesh opposed YSR Congress fiercely . YCP conducted a public meeting in Naravari palle . Lokesh said that no one had come to the public meeting in the village. Nara Lokesh posted the visuals and photos of the meeting. Nara Lokesh criticized the YCP by adding sarcasm he said this is vasthavam .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X