• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నేను ఒక్కడినే: దేవినేని అవినాశ్‌కు లోకేష్ హామీ, 'టచ్‌లో 10మంది వైసీపీ ఎమ్మెల్యేలు'

By Srinivas
|

విజయవాడ: దేవినేని నెహ్రూ వ్యక్తి కాదని, ఆయన ఓ వ్యవస్థ అని ఆయన తనయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాశ్ అన్నారు. దేవినేని నెహ్రూ ప్రథమ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ పట్ల నెహ్రూ అంకితభావం, క్రమశిక్షణ నచ్చడం వల్లే దివంగత ఎన్టీఆర్ ఆయనను ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించారన్నారు.

  ప్రత్యేక హోదా కోసం తాము నిలదీస్తం కానీ కాళ్లు మొక్కం : లోకేష్

  జనం కోసం జీవించిన నాయకుడు నెహ్రూ అన్నారు. కార్యకర్తలే శ్వాసగా తన తండ్రి బతికారన్నారు. తన తండ్రి నాడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబుతో కలిసి నడిచారని చెప్పారు. తమ కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. తనకు మంత్రి నారా లోకేష్ రాముడి లాంటి వాడని, తాను లక్ష్మణుడిలా అతని వెంట నడుస్తానని చెప్పారు.

  పాదయాత్ర తర్వాత అనూహ్య నిర్ణయం, బాబుకు జగన్ షాక్: ఒక్క దెబ్బకు పవన్ కళ్యాణ్ కూడా

  ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ సభ్యత్వం తీసుకున్న 10వ వ్యక్తి

  ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ సభ్యత్వం తీసుకున్న 10వ వ్యక్తి

  తెలుగుదేశం పార్టీ బలోపేతమే ధ్యేయంగా ముందుకు సాగుతానని దేవినేని అవినాశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. దేవినేని నెహ్రూ ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని చెప్పారు. విద్యార్థి నాయకుడిగా పేరొందిన ెహ్రూ 1982లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీ సభ్యత్వం తీసుకున్న పదో వ్యక్తి అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారన్నారు.

  నేను ఒక్కడినే.. అవినాష్‌కు హామీ

  నేను ఒక్కడినే.. అవినాష్‌కు హామీ

  దేవినేని అవినాశ్‌ క్రమశిక్షణ, ఓర్పు ఉన్న నాయకుడు అన్నారు.

  తన తండ్రికి తాను ఒక్కడినే అని, తన తమ్ముళ్లుగా దేవినేని అవినాశ్, చంద్రశేఖర్‌లకు మంచి రాజకీయ భవిష్యత్తు ఇస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పుటి తరానికి, ముందు తరాలకు దేవినేని నెహ్రూ గురువు అని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.

  టచ్‌లో పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలు

  టచ్‌లో పదిమంది వైసీపీ ఎమ్మెల్యేలు

  ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో పదిమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేవినేని అవినాశ్‌కు సీటు కేటాయించాలని లోకేష్‌కు జలీల్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.

  ఆ ఒకే ఒక్కడు పుస్తకం

  ఆ ఒకే ఒక్కడు పుస్తకం

  కాగా, చంద్రబాబు నాయుడు సాధించిన విజయాలపై కోట రమేష్ రాసిన 'ఆ ఒకే ఒక్కడు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. వారికి నారా లోకేష్ పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.

  English summary
  IT Minister Nara Lokesh while addressing people after paying tributes to late leader Devineni Nehru on his first death anniversary said Nehru will remain alive in hearts of people. Lokesh hailed the efforts of Devineni Nehru. He said the late leader had a great bonding towards party. Lokesh said Avinash has discipline like his father. Avinash hailed CM Chandrababu and Lokesh for the development of the state. Avinash said his father had worked for party activists.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more