వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా లోకేష్: పదవి చిన్నది, పొలిటికల్ ప్లాన్ పెద్దది

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు నారా లోకేష్‌ జాగ్రత్తగా ముందుకు వస్తున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా అందుకు పథకరచన చేసినట్లు అర్థమవుతోంది. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వకర్త పదవిని నారా లోకేష్‌కు ఇచ్చారు. నిజానికి, తెలుగు యువత అధ్యక్ష పదవిని ఆయనకు కట్టబెడుతారని అందరూ భావించారు.

ఊహాగానాలకు భిన్నంగా నారా లోకేష్‌ను చంద్రబాబు కొత్త పాత్రలో ప్రవేశపెట్టారు. కార్యకర్తల సంక్షేమానికి నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుందని పార్టీ మహానాడులో నారా లోకేష్ సభాముఖంగా సూచించారు. ఈ సూచన కూడా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్లు ఇప్పుడు అనిపిస్తోంది. ఆ సూచన చేసి, పార్టీ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిస్తున్న లోకేష్‌ను కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా ప్రవేశపెట్టడం సమంజసంగానే అనిపిస్తుంది. చంద్రబాబుకు కావాల్సింది అలా అనిపించడమే.

Nara Lokesh political future sketched

ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రచారం సాగించిన నారా లోకేష్ నాయకుడిగా తన సత్తాను నిరూపించుకున్నట్లు కూడా అయింది. స్వతహాగా ఎదిగి వచ్చినవారికే అవకాశాలుంటాయని చెప్పడానికి నారా లోకేష్ చేత చంద్రబాబు ఒక్కొక్కటే అడుగే వేయిస్తున్నారు. తన కుమారుడు అయినంత మాత్రాన నాయకుడు కావడం లేదని, ప్రజల్లోకి వెళ్లి నిరూపించుకున్నాడని ఆయన చెప్పదలుచుకున్నారు.

నిజానికి, తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో నారా లోకేష్ చాలా కాలంగా చురుగ్గా ఉంటున్నారు. అయితే, బయటకు మాత్రం పెద్ద తలదూర్చడం లేదనే భావనకు తావు ఇస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గ కూర్పులో కూడా నారా లోకేష్ చేయి వేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు చెప్పుల్లో నారా లోకేష్ కాళ్లు పెట్టడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ప్రస్తుత పరిణామం తెలియజేస్తోంది.

English summary
Telugudesam party president and Andhra Pradesh CM Nara Chandrababu Naidu has planned his son Nara Lokesh's political future to capture party leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X