వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామాలకు రాకుండానే: ఎన్నారైలకు లోకేష్, కేటీఆర్ ఒప్పందం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ స్మార్ట్‌ విలేజ్‌పై అవగాహనా కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామాల అభివృద్ధిలో ప్రవాసాంధ్యులను భాగస్వాములుగా చేసే లక్ష్యంతో పలు నగరాల్లో ఉన్న ఎన్నారైలను కలుస్తున్నారు.

నిన్న శాన్‌ఫ్రాన్షిస్కోలో నిర్వహించిన లోకేష్‌ ఆదివారం న్యూజెర్సీలో ప్రవాసాంద్రులతో సమావేశమయ్యారు. స్మార్ట్‌ విలేజ్‌ స్మార్ట్‌ వార్డులకి సేవలందించాలని కోరారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన శనివారం నాడు పిట్స్‌బర్గులోని కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. రాబోయే రోజుల్లో దేశంలోనే తెలంగాణను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

గ్రామాల దత్తత కోసం ఆన్‌లైన్‌ ద్వారా ఎలా రిజిష్టర్‌ అవ్వాలో వివరించారు. ఆయా గ్రామాలకు రాకుండానే ఇక్కడి నుంచే పర్యవేక్షించవచ్చునని చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

ప్రపంచ దేశాలను అమెరికా శాసిస్తుంటే, అమెరికాను ఇక్కడి తెలుగు వారు శాసిస్తున్నారని నారా లోకేష్ ఈ సందర్భంగా కొనియాడారు.

నారా లోకేష్

నారా లోకేష్

అమెరికా టాప్ టెన్ కంపెనీల్లోని టాప్ 10 పోస్టుల్లో తెలుగు వారు ఉన్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

నాడు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఇంజినీరింగ్ కళాశాలలు పెద్ద సంఖ్యలో స్థాపించారని, ఎంతోమందికి చదువు చెప్పించారని చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

మలేషియా నుండి సింగపూర్ విడిపోయినప్పుడు సింగపూర్ అభివృద్ధి చెందుతుందా లేదా అన్న సందేహం చాలామందిలో కలిగిందని, అనతికాలంలోనే అది శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

నేడు ఏపీ కూడా త్వరలోనే అభివృద్ధి సాధించి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా మారటం ఖాయమని నారా లోకేష్ చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

నారా లోకేష్ విజ్ఞప్తి నేపథ్యంలో ఎన్నారైలు న్యూజెర్సీలో అప్పటికప్పుడు 780 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. మరో 220 గ్రామాలను దత్తత తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.

 నారా లోకేష్

నారా లోకేష్

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. లోకేష్ ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు కుమారుడిగా, బాలకృష్ణ అల్లుడిగా వారి వ్యక్తిత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని మంచి నాయకుడిగా నిరూపించుకుంటున్నారన్నారు.

కేటీఆర్

కేటీఆర్

ప్రతీ ఎన్నారై తెలంగాణకు గుడ్ విల్ అంబాసిడర్‌గా మారాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.

కేటీఆర్

కేటీఆర్

శనివారం నాడు అమెరికాలో మూడో రోజు పర్యటిస్తున్న కేటీఆర్‌కు ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు ఇన్ రిథమ్ కంపెనీతో ఒప్పందం కుదిరింది.

English summary
Telugudesam Party leader Nara Lokesh Receives Huge Response In New Jersey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X