వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్మార్ట్‌ విలేజ్‌-స్మార్ట్‌ వార్డు ఆలోచనలో ఎన్నారైలను భాగస్వాములను చేసేందుకు, ఏపీని పెట్టుబడుల స్వర్గ ధామంగా మలిచేందుకు మే 3వ తేదీ నుంచి టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్‌ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

నారా లోకేశ్ అమెరికా పర్యటన కాస్తంత ఫలితం కనిపిస్తోంది. ఏపీలో సుమారు 1,000 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గాను ఎన్నారైలు ముందుకొచ్చారు. అంతే కాదు ఆయా గ్రామాలను దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పర్యటనలో భాగంగా న్యూజెర్సీలోని ఎన్నారైలు లోకేశ్‌కు అదివారం స్వాగతం పలికారు.

 న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

ఏపీలో సుమారు 1,000 గ్రామాలను అభివృద్ధి చేసేందుకు గాను ఎన్నారైలు ముందుకొచ్చారు. అంతే కాదు ఆయా గ్రామాలను దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పర్యటనలో భాగంగా న్యూజెర్సీలోని ఎన్నారైలు లోకేశ్‌కు అదివారం స్వాగతం పలికారు.

 న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

ఈ సందర్భంగా న్యూజెర్సీలోని ఎడిసన్‌ నగరం ఎడిసన్‌ హోటల్‌లో ఎన్నారైలు, తెలుగుదేశం పార్టీ అభిమానులను ఉద్దేశించి నారా లోకేశ్‌ మాట్లాడారు. ప్రపంచ దేశాలను అమెరికా శాసిస్తుంటే .. అమెరికాను ఇక్కడున్న తెలుగు వారు శాసిస్తున్నారని అన్నారు.

 న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

అమెరికాలోని అత్యుత్తమ పది కంపెనీల్లోని పది పోస్టుల్లో తెలుగువారున్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు 'స్మార్ట్‌ విలేజ్‌-స్మార్ట్‌ వార్డు' కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు.

 న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

ఈ కార్యక్రమంలో ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొని తమ తమ గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కోసం పాటు పడాలని సూచించారు. లోకేశ్‌ ప్రసంగానికి, విశ్లేషణలు, ఆలోచనలకు విజన్‌కు ముగ్ధులైన ఎన్నారైలు అప్పటికప్పుడు 780 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

మరో 220 గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఎన్నారైలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జె.తాళూరి, బ్రహ్మాజీ వలివేటి, మోహన్‌ కృష్ణ మన్నవ, తానా అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని, నాట్స్‌ చైర్మన్‌ మధు కొర్రపాటి తదితరులు లోకేశ్‌ ప్రయత్నాలను అభినందించారు.

న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

న్యూజెర్సీలో లోకేశ్: 1,000 గ్రామాల దత్తత

1,000 గ్రామాల దత్తత కోసం ఎన్నారైలు ముందుకొచ్చినట్లు తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ చైర్మన్‌ ఎల్‌వీఎస్‌ఆర్కే ప్రసాద్‌ పేర్కొన్నారు.

English summary
A rally of 60 cars lead Nara Lokesh to the Edison hotel where a huge meeting was organized by the followers & well-wishers of NRI TDP in New Jersey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X