వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతల మధ్య సహజం: గొడవపై లోకేష్, బీజేపీతో పొత్తు-కేశినేనిలపై ఆసక్తికరం

ప్రకాశం జిల్లా నేతల మధ్య విభేదాలపై మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ స్పందించారు. నేతల మధ్య అభిప్రాయబేధాలు సహజమని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రకాశం జిల్లా నేతల మధ్య విభేదాలపై మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ స్పందించారు. నేతల మధ్య అభిప్రాయబేధాలు సహజమని చెప్పారు. అయితే బహిరంగ విమర్శలు చేయకుండా పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించాలన్నారు.

కొత్త ఇబ్బందులేంటి: ఎమ్మెల్యేల రిజైన్ హెచ్చరికలపై బాబు సీరియస్కొత్త ఇబ్బందులేంటి: ఎమ్మెల్యేల రిజైన్ హెచ్చరికలపై బాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయుల హత్య, తదనంతర పరిణామాలు టిడిపి అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. మంగళవారం ఉదయం ఒంగోలులో కరణం, ఎమ్మల్యే గొట్టిపాటి రవికురమార్ నెట్టివేసుకున్నారు.

పోలీసులు విచారిస్తున్నారు

పోలీసులు విచారిస్తున్నారు

దీనిపై లోకేష్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో జరిగిన హత్యలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని తలిపారు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల అంశంపై స్పందించారు.

ప.గో. ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు లేదు

ప.గో. ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు లేదు

పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేల్లో ఎలాంటి తిరుగుబాటు లేదని నారా లోకేష్ తెలిపారు. వారి మనోభావాలు దెబ్బతినడం వల్ల కొంత ఆవేదన చెందారని చెప్పారు. జిల్లా పోలీస్ బాస్‌ వద్దంటూ 12 మంది ఎమ్మెల్యేలు గన్‌మెన్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

కేశినేని నాని వ్యక్తిగతం

కేశినేని నాని వ్యక్తిగతం

బీజేపీతో పొత్తు అంశంపై జరుగుతున్న చర్చ పైన కూడా నారా లోకేష్ స్పందించారు. బీజేపీతో పొత్తు వల్లే తనకు ఓట్లు రాలేదని, వచ్చే ఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే అంతకు డబుల్ మెజార్టీ సాధిస్తానని కేశినేని నాని అన్నారు. దీనిపై లోకేష్ మాట్లాడారు. కేశినేని నాని వ్యాఖ్యలు వ్యక్తిగతం అని చెప్పారు.

పొత్తుపై చర్చిస్తాం

పొత్తుపై చర్చిస్తాం

బిజెపితో పొత్తు అంశంపై మహానాడులో చర్చిస్తామని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపితో పొత్తుపై చర్చిస్తామని చెప్పడం ద్వారా.. బిజెపి లాగే టిడిపి కూడా పొత్తు విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.

English summary
Minister Nara Lokesh responds on differences in Parakasam TDP and Alliance with BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X