హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేశ్‌తో మంత్రులు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లడంతో, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్‌ రైతుల సమస్యలపై మంత్రులతో సమీక్షించారు. జనవరి 3వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేకపోవడం, సేకరణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించారు.

రైతుల సమస్యలపై చర్చించేందుకు మంత్రులు, పార్టీ నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నానని, వారు చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు మంగళవారం తెల్లవారుజామున ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు అదే కమిటీతో లోకేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

రైతుల నుంచి 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు పలువురు ఎమ్మెల్యేలతో నారా లోకేశ్‌ టీడీపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.

క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ - ప్రభుత్వం సమన్వయంతో పని చేసే దిశగా చర్చలు జరిపారు. రైతుల వద్ద ధాన్యం నిల్వలు, మద్దతు ధర పెంపు, మార్కెటింగ్‌ సౌకర్యాల విస్తరణ, నిల్వ సామర్థ్యం పెంపు, వరి రైతుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు.

 ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేశ్‌తో మంత్రులు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లడంతో, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్‌ రైతుల సమస్యలపై మంత్రులతో సమీక్షించారు. జనవరి 3వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేకపోవడం, సేకరణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేశ్‌తో మంత్రులు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేశ్‌తో మంత్రులు

రైతుల నుంచి 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతోపాటు పలువురు ఎమ్మెల్యేలతో నారా లోకేశ్‌ టీడీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం భేటీ అయ్యారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేశ్‌తో మంత్రులు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేశ్‌తో మంత్రులు

క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ - ప్రభుత్వం సమన్వయంతో పని చేసే దిశగా చర్చలు జరిపారు. రైతుల వద్ద ధాన్యం నిల్వలు, మద్దతు ధర పెంపు, మార్కెటింగ్‌ సౌకర్యాల విస్తరణ, నిల్వ సామర్థ్యం పెంపు, వరి రైతుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేశ్‌తో మంత్రులు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేశ్‌తో మంత్రులు

ఆ తర్వాత పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రజాపంపిణీ, ఇతర అవసరాల కోసం 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. రైతులకు మరింత మద్ధతు ధర లభించేలా సీజన్‌ నుంచి పొడవు బియ్యం వచ్చే వరిని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.

వరి కొనుగోలు కేంద్రాల్లో చెక్కుల చెల్లింపులు జరపడంతో రైతులకు సకాలంలో డబ్బు అందడం లేదని, దీనికి ప్రత్యామ్నాయాన్ని సూచించాల్సి ఉందని చెప్పారు. ధాన్యాన్ని ఆరబెట్టడానికి అవసరమైన యంత్రాలను 75 శాతం సబ్సిడీపై సమకూర్చాలని యోచిస్తున్నట్టు వివరించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేశ్‌తో మంత్రులు .

రైతులకు దళారుల బెడద లేకుండా ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌ యార్డులకు తరలించేందుకు రవాణా ఖర్చులు చెల్లించే విషయంపై చర్చించినట్టు పత్తిపాటి తెలిపారు. రైతులకు మద్దతు ధర లభించేలా ‘ధరల నియంత్రణ నిధి' ఏర్పాటు చేయాలని పలువురు శాసనసభ్యులు సమీక్షలో సూచించినట్టు పుల్లారావు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

మంగళవారం నిర్వహించే ఈ సమావేశానికి రావాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించినా వారు నిరాకరించారు. మంత్రులు సచివాలయంలోని తమ ఛాంబర్‌లో సమావేశం నిర్వహిస్తే తాము వచ్చి ధాన్యం సేకరణ, మద్దతు ధరపై వివరాలు ఇస్తామని, అది తమ భాద్యత అని, అందులో ఎవరు పాల్గొంటారన్నది తమకు అనవసరమని వారు స్పష్టం చేసినట్లు తెలిసింది.

English summary
Nara Lokesh Review meetings at NTR Trust Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X