• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా నియంత్రణకు జగన్ ఏం చేశాడు.. బొక్క చేశాడు, వైసీపీ నేతలే దుమ్మెత్తిపోశారు : నారా లోకేష్ ధ్వజం

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వైసీపీ నేతలు మాట్లాడుకున్న వీడియో ఒకటి ఇప్పుడు టిడిపి నేతలకు ఆయుధంగా మారింది. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుంది అని, ఏం చేయలేని పరిస్థితి నెలకొందని సీఎం వైఎస్ జగన్ చేతులెత్తేశారు అని స్వయంగా వైసీపీ నేతలే మాట్లాడుకున్నారని టిడిపి నేతలు ముఖ్యంగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.

హెల్త్ ఎమర్జెన్సీ పక్కన పెట్టి, అమూల్ ముసుగులో సీఎం జగన్ క్విడ్ ప్రోకో : టీడీపీ నేత పట్టాభి ధ్వజంహెల్త్ ఎమర్జెన్సీ పక్కన పెట్టి, అమూల్ ముసుగులో సీఎం జగన్ క్విడ్ ప్రోకో : టీడీపీ నేత పట్టాభి ధ్వజం

కరోనా పరిస్థితులపై సాక్షాత్తు వైసీపీ నేతలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కరోనా పరిస్థితులపై సాక్షాత్తు వైసీపీ నేతలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఈనెల 3వ తేదీన రాజమండ్రి వైసిపి కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ నివాసంలో ఎంపీ మార్గాని భరత్,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు రాష్ట్రంలో నెలకొన్న కరోనా సంక్షోభం గురించి మాట్లాడుతున్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు తరలించడానికి 30,000 రూపాయలు ,దహన సంస్కారాలకు 12000 రూపాయలు తీసుకుంటున్నారని సాక్షాత్తు వైసీపీ నేతలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ నీ పనికిమాలిన పాలనని వైసీపీ నేతలే దుమ్మెత్తిపోశారు

జగన్ నీ పనికిమాలిన పాలనని వైసీపీ నేతలే దుమ్మెత్తిపోశారు

రాష్ట్రంలో కరోనా దెబ్బకు పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని,ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి వచ్చిందని, సీఎం జగన్ చేతులెత్తేశారని వారు పేర్కొన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లోకేష్, జనం కాదు వైయస్ జగన్ చేతగాని పాలనను వైసీపీ నేతలే ఎండగడుతున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కరోనా కట్టడికి ఏం చేయలేని నీ పనికిమాలిన పాలనని వైసీపీ నేతలే దుమ్మెత్తిపోశారు. ప్రజల ప్రాణాలు గాలికొదిలేశారని ఈ విషయం మూర్ఖపు ముఖ్యమంత్రికి చెబితే సొంత పార్టీ అని కూడా చూడకుండా కక్ష సాధింపులకు దిగుతారని భయపడి ఎవరూ నోరు మెదపడం లేదంటూ వ్యాఖ్యానించారు.

పులివెందుల పిల్లి మెడలో తొలి గంట కట్టాడు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

పులివెందుల పిల్లి మెడలో తొలి గంట కట్టాడు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

ఇదిగో ఇలా వైసిపి ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు నీ మూర్ఖత్వాన్ని,నీ చేత గాని పాలనను, కరోనా కట్టడిలో నీ వైఫల్యాలను కుండబద్దలు కొడుతున్నారు అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు కరోనా నియంత్రణకు జగన్ ఏం చేశాడు .. బొక్క చేశాడు ..అంటూ పులివెందుల పిల్లి మెడలో తొలి గంట కట్టాడు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ . ప్రభుత్వ లాజిస్టిక్స్ మెయింటెన్ చేయడం లేదు,జగన్ చేతులెత్తేశాడు అని మీ ఆకుల ఆగ్రహంగా ఉన్నారు.

 మీ వాళ్లే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపు రెడ్డి అని..

మీ వాళ్లే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపు రెడ్డి అని..

శవాల దహనానికి కూడా చందాలు వేసుకోవాల్సి వస్తుందని వైసీపీ నేతలే వాపోతున్నారు. నేను మూర్ఖపు రెడ్డి అంటే ఉలిక్కిపడి బూతుల మంత్రిని బూతులతోనో,పేటీఎం బ్యాచ్ లను ఫేక్ ట్వీట్స్ తోనో దింపుతావు. నిన్ను మీ వాళ్లే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపు రెడ్డి అని..ఇప్పుడేమంటావ్ అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని టీడీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ నేతల వీడియో జగన్ ను టార్గెట్ చెయ్యటానికి వారికి ఆయుధం అయ్యింది.

English summary
One of the videos of YCP leaders talking about the latest situation in the state in the wake of the corona epidemic boom in Andhra Pradesh has now become a weapon for TDP leaders. TDP leaders, especially Nara Lokesh targets AP CM YS Jaganmohan Reddy, YCP leaders themselves for saying that the corona epidemic would boom further in the second wave and that CM YS Jagan himself had given up on what could not be done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X