వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విసుగేసి వదిలేశా: పవన్‌పై లోకేష్, స్పీకర్ పిలుస్తున్నారంటూ.. ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు షాక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రత్యేక హోదా కోసం తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం :లోకేష్

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై పదేపదే అవినీతి ఆరోపణలు చేయడంపై తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి నారా లోకేష్ శుక్రవారం స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ టీడీపీ సైకిల్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

తనపై ఆరోపణలు చేసేవారు అందుకు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు. విచారణకు సిద్ధమని తాను ఎప్పుడో చెప్పానని అన్నారు. తనపై చేసిన ఆరోపణల మీద ఆధారాలు ఉంటే ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌ను ఇప్పటికి తాను పదిసార్లు అడిగానని చెప్పారు.

పవన్ అంటే సర్రున, పార్లమెంట్ ఆగింది, ఆ ద్రోహం చేయవద్దు: ఉండవల్లిపవన్ అంటే సర్రున, పార్లమెంట్ ఆగింది, ఆ ద్రోహం చేయవద్దు: ఉండవల్లి

పవన్ కళ్యాణ్ స్పందించలేదు, విసుగుపుట్టి వదిలేశా

పవన్ కళ్యాణ్ స్పందించలేదు, విసుగుపుట్టి వదిలేశా

తాను మరోసారి చెబుతున్నానని, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తనపై చేసిన అవినీతి ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. పవన్ ఇప్పటి వరకు స్పందించలేదని, అందుకే తాను విసుగుపుట్టి వదిలేశానని చెప్పారు. ఆధారాలు చూపిస్తే విచారణకు సిద్ధమని చెప్పారు.

మా ఎంపీలు ప్రధాని ఎదుట నిరసన తెలిపారు

మా ఎంపీలు ప్రధాని ఎదుట నిరసన తెలిపారు

లోకసభలో తమ పార్టీకి చెందిన ఎంపీలు విభజన హామీలు, ఏపీకి హోదాపై బాగా పోరాడారని లోకేష్ అన్నారు. లోకసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట నిరసన తెలిపారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తాము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు.

మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ

మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ

మంత్రులు నారా లోకేష్, చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావుల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. పైళ్ల విషయంలో విగంలో హోంమంత్రిని తాను అందుకోలేకపోతున్నానని లోకేష్ అన్నారు. దానికి చినరాజప్ప స్పందిస్తూ.. తాను ప్రత్యేకంగా దృష్టి సారించడం లేదని, రెగ్యులర్‌గా చేసుకొని వెళ్తున్నానని అన్నారు.

పచ్చ చొక్కాపై చర్చ

పచ్చ చొక్కాపై చర్చ

ఇప్పుడు కొత్తగా పచ్చ చొక్కా ఎందుకు వేసుకున్నావని మంత్రి పుల్లారావు మంత్రి దేవినేనిని ప్రశ్నించారు. చంద్రబాబు ఊరుకోరని దేవినేని సమాధానం చెప్పారు. మధ్యలో లోకేష్ కల్పించుకొని కొంతమంది దుస్తులతో, మరికొంతమంది తమ పని తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబును ఇంప్రెస్ చేస్తున్నారని చెప్పారు. మండలికి కొంతమంది మంత్రులు సరిగా రావడం లేదన్నారు. ఉభయ సభల్లో ప్రతి ప్రశ్నకు తాను సమాధానం చెప్పానని లోకేష్ తెలిపారు.

ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు

ఢిల్లీలో ఆసక్తికర పరిణామాలు

ఢిల్లీలో పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుటే టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ తర్వాత వాయిదా పడిన తర్వాత కూడా వారు లోకసభలోనే నిరసన తెలిపారు. స్పీకర్ ఆ తర్వాత అక్కడి నుంచి తన చాంబర్‌కు వెళ్లారు.

స్పీకర్ పిలుస్తున్నారంటూ టీడీపీ ఎంపీలకు షాక్

స్పీకర్ పిలుస్తున్నారంటూ టీడీపీ ఎంపీలకు షాక్

లోకసభలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేయడంతో తలుపులు వేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో సిబ్బంది టీడీపీ ఎంపీల వద్దకు వచ్చి స్పీకర్ పిలుస్తున్నారని, బయటకు రప్పించారు. వారు బయటకు రాగానే సిబ్బంది తలుపులు వేశారు. మరోవైపు ఎంపీలు వచ్చేలోగా స్పీకర్ చాంబర్ నుంచి వెళ్లిపోయారు. దీంతో స్పీకర్ చాంబర్ వద్ద వారు నిరసన తెలిపారు.

English summary
Andhra Pradesh Minister and Telugudesam Party leader Nara Lokesh says he is ready to any enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X