విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వస్తే అమరావతిలో ధరలు తగ్గుతున్నాయి: లోకేష్, పవన్ కళ్యాణ్‌కూ సమాధానం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతికి వచ్చినప్పుడల్లా ఇక్కడి భూముల ధరలు పడిపోతున్నాయని నారా విమర్శించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతికి వచ్చినప్పుడల్లా ఇక్కడి భూముల ధరలు పడిపోతున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు విమర్శించారు.

రైతులను రెచ్చగొట్టి భూముల రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని, అందుకే ఆయన తరుచూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ వచ్చి రగడ చేసినప్పుడల్లా భూముల ధరలు తగ్గుతున్నాయన్నారు.

నాగార్జునకు గిఫ్ట్‌లివ్వం, ఎగిరిపడుతున్నారు, లేనిది ఉన్నట్లు చెప్పను: కేటీఆర్

పట్టిసీమను వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు అది తమ వల్లే వచ్చిందని చెప్పడం విడ్డూరమన్నారు. భవిష్యత్తులో అమరావతిని కూడా తామే నిర్మించామని చెప్పుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా రాజధాని నిర్మాణం పైనే ఉందన్నారు.

Nara Lokesh says land rates are decreasing when YS Jagan touring Amaravati

తమ ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోందన్నారు. కిడ్నీ రోగులకు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నకు సమాధానంగా కనిపిస్తోంది.

ఇటీవల పవన్ శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో పర్యటించి కిడ్నీ వ్యాధి సమస్యను ఎలుగెత్తారు. దీనిపై మంత్రులు, టిడిపి నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా పవన్ పేరు పెట్టకుండా స్పందించారు. కిడ్నీ రోగులకు డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

English summary
TDP leader Nara Lokesh on Wednesday alleged that land rates in amaravati are decreasing when YS Jagan touring.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X