• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లా ప‌నిచేస్తున్న‌ పోలీసులు.!ప్రజలకు ఖాకీలంటే గౌర‌వం పోతోందన్న నారా లోకేష్.!

|

అమరావతి/హైదరాబాద్ : ప్రతీసారీ ఏదోఒక రాజకీయ కారణంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించే టీడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇప్పుడు రూటు మార్చినట్టు తెలుస్తోంది. తాజాగా నారా లోకేష్ పోలీసులపై సంచలన వాఖ్యలు చేసారు. ప్ర‌జాధ‌నాన్ని జీత‌భ‌త్యాలుగా తీసుకుంటూ ప్ర‌జ‌ల కోసం, శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ కోసం ప‌నిచేయాల్సిన కొంతమంది పోలీసులు అధికార పార్టీ కోసం ప‌నిచేస్తున్నార‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ తారా స్థాయిలో ద్వజమెత్తారు.

రాజ్యాంగ హ‌క్కుల్ని కాల‌రాస్తోన్న పోలీసులు.. న్యాయ పోరాటం చేస్తామన్న లోకేష్..

రాజ్యాంగ హ‌క్కుల్ని కాల‌రాస్తోన్న పోలీసులు.. న్యాయ పోరాటం చేస్తామన్న లోకేష్..


వైసీపి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిని స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తూ సోష‌ల్‌మీడియాలో వ‌చ్చిన పోస్ట్ షేర్ చేసినందుకు పోలీసులు అక్ర‌మంగా మ‌హేష్‌, క‌ల్యాణ్‌ల‌ను అరెస్ట్ చేసారని ఆరోపించారు. మ‌హేష్‌, క‌ల్యాణ్‌ల‌ను ప‌రామ‌ర్శించిన లోకేష్ వారికి ఎప్పుడూ అండ‌గా వుంటామ‌ని హామీ ఇచ్చారు. న్యాయ‌బ‌ద్ధంగా ఉన్నాం, చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం మిమ్మ‌ల్ని అన్యాయంగా త‌ప్పుడు కేసుల్లో ఇరికించి వేధించాల‌ని చూస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోద‌ని, న్యాయ‌పోరాటం చేస్తుంద‌ని హెచ్చరించారు లోకేష్.

శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడే పోలీసులు కాదు.. వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్న టీడిపి

శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడే పోలీసులు కాదు.. వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్న టీడిపి


ఎటువంటి అభ్యంత‌ర‌క వ్యాఖ్య‌లు లేని పోస్టుల‌కే అరెస్ట్ చేస్తే .. బూతులు, మార్ఫింగ్ ఫోటోలు, అవాస్త‌వాల‌ను ప్రతిరోజూ ప్ర‌చారం చేసే జ‌గ‌న్మోహన్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాల‌ని పోలీసుల్ని సూటిగా ప్ర‌శ్నించారు లోకేష్. టిడిపిపైనా, వ్య‌వ‌స్థ‌ల‌పైనా అస‌భ్య‌రాత‌లు, ఫేక్‌, మార్పింగ్‌లు చేస్తోన్న వైసీపీ మౌత్ పీస్‌ సైరా పంచ్‌, విజ‌య‌సాయిరెడ్డిలు వేస్తోన్న అసత్య పోస్టుల‌పై ఫిర్యాదు ఇచ్చినా, ఏనాడైనా చ‌ర్య‌లు తీసుకున్నారా అని నారా లోకేష్ పోలీసుల్ని ప్ర‌శ్నించారు.

అక్ర‌మ నిర్బంధం నుంచి విడుద‌లైన మ‌హేష్‌, క‌ళ్యాణ్‌.. పార్టీ అండ‌గా వుంటుందన్న లోకేష్..

అక్ర‌మ నిర్బంధం నుంచి విడుద‌లైన మ‌హేష్‌, క‌ళ్యాణ్‌.. పార్టీ అండ‌గా వుంటుందన్న లోకేష్..


జగన్ సొంత పత్రిక వాళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం చెప్పిన ఎస్పీ, మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుపై న్యాయ‌వాదులు, టిడిపి నేత‌లు ఇచ్చిన ఫిర్యాదుపై ఏం చ‌ర్య‌లు తీసుకున్నార‌ని మీడియా ప్ర‌శ్నిస్తే, తనకు వినిపించడం లేదని, లైట్ ఫెయిలైంద‌ని చెప్ప‌డం చూస్తుంటే, పోలీసులు ఎంత‌గా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారో అర్థం అవుతోంద‌న్నారు. సోష‌ల్‌మీడియాలో పోస్టు పెట్ట‌డం అంత‌ర్జాతీయ నేరం అయిన‌ట్టు ఉగ్ర‌వాదుల్లా ముసుగులు వేసి మ‌రీ మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టిన పోలీసులు రాజ్యాంగాన్ని, చ‌ట్టాల‌ని పూర్తిగా ఉల్లంఘించార‌ని లోకేష్ మండిపడ్డారు.

టీడిపి కార్య‌క‌ర్త‌ల జోలికొస్తే చూస్తూ ఊరుకోం.. వైసీపిని హెచ్చరించిన లోకేష్..

టీడిపి కార్య‌క‌ర్త‌ల జోలికొస్తే చూస్తూ ఊరుకోం.. వైసీపిని హెచ్చరించిన లోకేష్..


ఇదివ‌ర‌క పోలీసులంటే గౌర‌వం వుండేదని, ఇటువంటి సంఘటనలు వెలుగు చూసాక ఆ గౌర‌వం పోయింద‌న్నారు లోకేష్. అధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేయ‌డానికి ఖాకీ డ్రెస్‌ని అడ్డుపెట్టుకోవ‌డం ఎందుకని, వైకాపా కండువా వేసుకోవ‌చ్చ‌ని వైకాపా కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసుల‌కు స‌ల‌హా ఇచ్చారు లోకేష్. న్యాయ‌పోరాటం చేస‌యినా వైసీపి అరాచ‌కాల‌ను అడ్డుకుని తీరుదాం అని మ‌హేష్‌, క‌ళ్యాణ్‌ల‌కు ధైర్యం చెప్పారు లోకేష్. ఏపీలో రాజ్యాంగం ఇచ్చిన హ‌క్కుల‌ని కాల‌రాస్తున్నార‌ని, ఇది ఎంత మాత్రం స‌హించేదిలేద‌ని, మ‌న హ‌క్కుల కోసం పోరాడ‌దామ‌ని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

English summary
Telugu Desam Party National General Secretary Nara Lokesh said that some policemen who are supposed to work for the security of the peace are working for the ruling party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X