అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీకి లోకేష్ ఝలక్, షాకింగ్ ప్రశ్న.. పెట్రోల్ ఖర్చు కూడా బ్రాహ్మణే ఇస్తుంది

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత టిడిపి యువనేత నారా లోకేష్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి షాకిచ్చారు! రూ.2వేల నోట్లతో మరో కొత్త సమస్య వచ్చిందని లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.2వేల నోటు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

అవినీతి నిర్మూలించాలంటే నగదు బదలీయే ఉత్తమ పరిష్కారం అన్నారు. రూ.2వేల నోటు తేవడాన్ని చంద్రబాబు కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు కోసం నిరంతరం పోరాడుతామని ఆయన చెప్పారు.

అమరావతి నిర్మాణంపై..

రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకోవడమే అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎవరు అడ్డుపడినా ఎన్ని ఆటంకాలు సృష్టించినా అమరావతి నిర్మాణం ఆగబోదన్నారు.

Nara Lokesh shocks BJP with his comments on currency notes

గుంటూరు జిల్లాలోని చలపతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని, సామాజిక, వర్తమాన వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.

వ్యక్తులు, రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాడుతున్నారన్నారు. కేంద్రంతో తెగతెంపులు చేసుకోవడం రెండు నిమిషాల పని అని, తర్వాత రాష్ట్రానికి నిధులు, పరిశ్రమలు రాకపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు.

పెట్టుబడుల సాధన విషయంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందన్నారు. రాజకీయాల్లో అవినీతి పోవాలంటే.. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడమే సరైన మార్గమన్నారు. అయితే రూ.2000 నోట్లతో కొత్త సమస్య ఉత్పన్నమవుతుందన్నారు.

ప్రొఫెసర్ లక్ష్మిపై..

గుంటూరు జిల్లాలో సంధ్యారాణి మృతి కేసులో ప్రొఫెసర్ లక్ష్మి పైన చర్యలు పెద్ద పని కాదన్నారు. కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బ్రాహ్మణి సంపాదిస్తుంటే..

ఓ విద్యార్థి ప్రశ్నతో లోకేష్ అవాక్కయ్యారు. భువనేశ్వరి (లోకేష్ అమ్మ), బ్రాహ్మణి (లోకేష్ భార్య) సంపాదిస్తుంటే మీరు ఖర్చు పెడుతున్నారా అని విద్యార్థులు ప్రశ్నించారు. దీనిపై లోకేష్ మాట్లాడుతూ.. తొలి నుంచి తమ ఖర్చులను అమ్మే చూస్తోందని చెప్పారు. తనకు కారు పెట్రోలు ఖర్చులు కూడా భార్య బ్రాహ్మణియే ఇస్తోందన్నారు. తన అమ్మ తన తండ్రికి ఇరవై ఏళ్లుగా ఖర్చులకు ఇస్తోందన్నారు.

English summary
Telugudesam Party leader Nara Lokesh shocks BJP with his comments on currency notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X