వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష కోట్లు లూటీ చేస్తే టైం కావాలి.. 29 వేల మంది సమస్య త్వరగా పరిష్కరించాలా: లోకేశ్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ మండిపడ్డారు. అమరావతి రాజధాని మార్పుకు సంబంధించి త్వరగా విచారణ జరగాలని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. మరీ మీ అవినీతి కేసుల సంగతేంటీ అని ప్రశ్నించారు. ఆ కేసుల విచారణ కూడా త్వరగా జరిగితే బాగుంటుందని సూచించారు. గురువారం లోకేశ్ ట్వీట్లతో జగన్‌ను ఏకీపారేశారు. మీకో న్యాయం.. రాజధానికో న్యాయమా అంటూ ధ్వజమెత్తారు.

21వ తేదీ వరకు స్టేటస్ కో..

మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలిపిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కల్పించుకోమని తేల్చిచెప్పింది. ఇవాళ విచారణ జరగగా హైకోర్టు స్టేటస్ కోను వచ్చేనెల 21వ తేదీ వరకు పొడగించింది. అయితే దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ.. అమరావతి రాజధానిని చంపేందుకు తెగ ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. అందుకోసమే విచారణ త్వరగా జరపాలని కోరుతున్నారని గుర్తుచేశారు. మీర మీరు దోచుకున్న అవినీతి సొమ్ము సంగతేంటి అని నారా లోకేశ్ ప్రశ్నించారు.

లక్ష కోట్ల ప్రజాధనం లూటీ

లక్ష కోట్ల ప్రజాధానం దోచిన 11 కేసుల సంగతేంటి అని లోకేశ్ అడిగారు. మరీ ఆ కేసుల విచారణకు సహకరిస్తున్నారా అని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా వైరస్ పేరు చెప్పి ఓసారి.. కోర్టుకు రావాలంటే 60 లక్షల నగదు ఖర్చవుతుందని మరోసారి చెప్పి తప్పించుకుంటుంది మీరు కాదా అని లోకేశ్ ప్రశ్నించారు. ఏదో సాకు చెప్పి తప్పించుకోవడంలో మీకన్నా సాటి మరేవరు లేరని చెప్పారు.

ప్రతిపక్ష నేత.. ప్రభుత్వాధినేత..

ప్రతిపక్ష నేత.. ప్రభుత్వాధినేత..

గత ఐదేళ్లలో ప్రతిపక్ష నేతగా ఉన్నాను రాలేని చెప్పారని లోకేశ్ గుర్తుచేశారు. ఇప్పడు ప్రభుత్వాధినేత అంటున్నారని మండిపడ్డారు. వివిధ రకాల పిటిషన్లు వేసి.. పదేళ్లు గడిపేశారని మండిపడ్డారు. కానీ 29 వేల రైతుల జీవితాలతో ముడిపడి ఉన్న రాజధాని అంశం మాత్రం రోజుల్లోనే తేలిపోవాలా అని అడిగారు. లక్షల కోట్ల ప్రజాధానం దోస్తే ఏళ్లపాటు కొనసాగాలా అని ధ్వజమెత్తారు.

Recommended Video

Mahatma Gandhi’s Glasses Sold for Rs 2.5 Crore in UK's Bristol Auction 6 నిమిషాల్లో 260,000 పౌండ్లు
స్టే పొడగింపు..

స్టే పొడగింపు..

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపగా.. దానిపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో విచారణ జరుగుతున్నందున.. కల్పించుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం నిన్న స్పష్టంచేసింది. ఇవాళ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇదివరకు విధించిన స్టేటస్ కోను ధర్మాసనం పొడిగించింది. వచ్చే నెల 21వ తేదీ వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. ఈ క్రమంలో నారా లోకేశ్ స్పందించి.. సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.

English summary
tdp leader nara lokesh slams cm jagan mohan reddy on three capital issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X