వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి విశ్వరూప్ నక్సలైట్ల కామెంట్స్: న్యాయం చేయాలని కోరితే ఉచిత సలహాలా, నారా లోకేశ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

దళిత యువకుడు వరప్రసాద్ నక్సలైట్లలోకి వెళతా పర్మిషన్ ఇవ్వాలని ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలే అగ్గిరాజేసిన అంశంపై మంత్రి కామెంట్స్ మాటల యుద్ధానికి దారితీసింది. దీనిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మంత్రి, తర్వాత దళిత నేత, వైసీపీ నేతల కామెంట్స్ వీడియోను పోస్ట్ చేశారు. దళితులు అంటే ఎందుకు చిన్నచూపు అని లోకేశ్ మండిపడ్డారు.

నక్సలైట్లలో కలువొచ్చు.. అభ్యంతరం లేదు

ఇసుక అక్రమ మాఫియా అడ్డుకున్న వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేతలను అరెస్ట్ చేయకపోవడంతో రాష్ట్రపతికి లేఖ రాశాడు. నక్సలైట్లలో కలిసిపోతానని వాపోయాడు. దీనిపై మంత్రి విశ్వరూప్ కామెంట్స్ చేశారు. నక్సలైట్లలో కలిసిపోతానంటే కలువాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇందుకు రాష్ట్రపతి అనుమతి అవసరం లేదన్నారు. ఎవరైనా నక్సలైట్లలో చేరొచ్చని.. మావోయిస్టుల్లో చేర్చేందుకు అనుమతి అక్కర్లేదని చెప్పడంతో దుమారం చెలరేగింది.

మీరు చేరొచ్చు కదా..?

మీరు చేరొచ్చు కదా..?

ఆ వెంటనే కనకారావు అనే దళిత నేత మంత్రి కామెంట్లను ఖండించారు. దళితుల పట్ల మీరు చూపే శ్రద్ద ఇదేనా అంటూ ధ్వజమెత్తారు. అవసరమైతే మీరు, కుటుంబ సభ్యుల్లో మావోయిస్టుల్లో చేరాలని సూచించారు. అంతేకానీ ఉచిత సలహాలు ఇవ్వడం ఏంటీ అని మండిపడ్డారు. వైసీపీ నేతలు స్పందిస్తూ.. సరదాగా ఉంటే మీరు మావోయిస్టుల్లో చేరాలని కోరారు. చంద్రబాబు నాయుడు, అనుచరులు నక్సలైట్లలో చేరాలని కోరారు.

 రాజారెడ్డి రాజ్యాంగం అమలుకు నిదర్శనం...?

రాజారెడ్డి రాజ్యాంగం అమలుకు నిదర్శనం...?

వ్యవహారంపై నారా లోకేశ్ మండిపడ్డారు. సాటి దళిత యువకుడికి న్యాయం చేయాల్సిన మంత్రి ఈ విధంగా కామెంట్స్ చేయడం తగదన్నారు. నక్సలైట్లలో చేరాలని కోరడం రాజారెడ్డి రాజ్యాంగం అమలుకి నిదర్శనం అని మండిపడ్డారు. జగన్ హయాంలో దళితులకు జీవించే హక్కు లేదా అని ఫైరయ్యారు. వారి హక్కులను ప్రభుత్వ కాలరాస్తోందని ఫైరయ్యారు.

Recommended Video

Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu
ఇదీ విషయం

ఇదీ విషయం


తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైసీపీ నేత ఇసుక అక్రమ రవాణాను దళిత యువకుడు వరప్రసాద్ గతనెలలో అడ్డుకున్నారు. అయితే అతనిని పోలీసు స్టేషన్ తీసుకెళ్లి దాడి చేయడమే గాక.. శిరోముండనం చేశారు. అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది. వెంటనే ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేసి.. చేతులు దులుపుకున్నారు. కానీ తనకు న్యాయం జరగలేదని వరప్రసాద్ మళ్లీ మీడియా ముందుకొచ్చారు. మాజీ సర్పంచ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదు అని.. తననే సూటి పోటీ మాటలు అంటున్నారని ప్రసాద్ చెప్పారు. అందుకే నక్సలైట్లలో కలవాలని నిర్ణయం తీసుకున్నానని రాష్ట్రపతికి లేఖ రాశారు. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.

English summary
tdp leader nara lokesh slams minister vishwaroop maoist comments. vara prasad urge to justice but minister told irresponsibility lokesh said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X