వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 మంది చనిపోతే చీమకుట్టినట్లయినా లేదు: జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైరయ్యారు. ప్రజల సంక్షేమాన్ని వారు మరిచారని దుయ్యబట్టారు. నాటుసారా, శానిటైజర్ తాగి చనిపోతున్న నేపథ్యంలో లోకేశ్ స్పందించారు. ఈ మేరకు వరసగా ట్వీట్లు చేశారు. 30 మంది చనిపోయిన ప్రభుత్వానికి పట్టనట్టు లేదని మండిపడ్డారు. వారి మృతికి ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

వైన్ షాపుల్లో సొంత బ్రాండ్లు తీసుకొచ్చారని లోకేశ్ విమర్శించారు. ఆ బ్రాండ్ల రేట్లు పెంచి మద్యపాన నిషేధం అంటూ కొత్త భాష్యం చెప్పారని తెలిపారు. ఇప్పుడు శానిటైజర్ తాగించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ఇదీ కూడా మద్యపాన నిషేధంలో భాగమే అంటారేమో అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటివరకు 30 మంది చనిపోయిన.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు.

nara lokesh slams ys jagan govt on sanitizer deaths..

తిరుపతిలో కూడా నలుగురు శానిటైజర్ తాగి చనిపోవడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న హత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం పేరుతో సమాంతర మాఫియా నడుపుతోందని ఆరోపించారు. జగన్ రెడ్డి సర్కార్‌పై జ్యుడిషీయల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే మద్యం ధరలు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. మందు ధర పెరగడంతో కొందరు సారా, శానిటైజర్ తాగుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిర్ణయానికి వచ్చింది. 30 నుంచి 40 శాతం మందుపై ధర తగ్గిస్తారని తెలుస్తోంది.

English summary
30 people dead because of government negligence nara lokesh slams andhra pradesh government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X