నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్ నోట.. పవన్, బాలయ్య సినిమాల మాట!: జగన్‌పై సెటైర్లు..

|
Google Oneindia TeluguNews

నెల్లూరు : విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాల ద్వారా యువతకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు టీటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈమధ్య వరుస ముఖాముఖి కార్యక్రమాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారాయన.

గురువారం నాడు తిరుపతిలోని చదలవాడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్.. తాజాగా నెల్లూరు యువ చైతన్య యాత్రలో పాల్గొన్నారు. యువ చైతన్య యాత్రలో భాగంగా.. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు లోకేష్.

Nara lokesh speech in Narayana Medical college!

ఏపీలో కోతల్లేని కరెంట్ ఇస్తున్న ప్రభుత్వ పనితనం గురించి విద్యార్థులకు వివరించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. సీరియల్స్ చూడటానికి ఇబ్బంది పడట్లేదు కదా? బాలయ్య సినిమాలు చూడటానికి ఇబ్బంది లేదు కదా? పవన్ కళ్యాణ్ సినిమాలు చూడటానికి ఇబ్బంది లేదు కదా? అంటూ విద్యార్థులతో సరదా వ్యాఖ్యలు చేశారు. లోకేష్ నోట బాలయ్య, పవన్ కళ్యాణ్ ల పేర్లు వినగానే.. అరుపులు, కేరింతలతో విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తమైంది.

మొత్తానికి.. సందర్బానుసారం జనం చేత చప్పట్లు, ఈలలు కొట్టించడానికి లోకేష్ కూడా తన ప్రసంగాలకు పదునుపెడుతున్నట్టే కనిపిస్తోంది.

ఆమెతోనే పెరిగా, ఆమెనే ప్రేమిస్తా.. దటీజ్ లోకేష్: లోకేష్ఆమెతోనే పెరిగా, ఆమెనే ప్రేమిస్తా.. దటీజ్ లోకేష్: లోకేష్

జగన్‌పై సెటైర్లు :

నెల్లూరులో జరిగిన యువ చైతన్య యాత్ర సందర్బంగా.. ప్రతిపక్ష అధినేత జగన్ కంపెనీలపై పరోక్షంగా సెటైర్లు వేశారు లోకేష్. పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ వైసీపీపై పరోక్ష ఆరోపణలు చేసిన ఆయన.. పరిశ్రమలకు భూములు కేటాయించకపోతే.. ఆకాశంలో ఏర్పాటు చేయాలా? అని ఎద్దేవా చేశారు.

పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయిస్తుంటే అడ్డుపడుతున్న జగన్.. తన కంపెనీలు ఎక్కడ నెలకొల్పారో చెప్పాలని నిలదీశారు. ఇక ఇదే సమావేశంలో మెడికల్ కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి.. రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల్లో ప్రగతి విత్తనాలు నాటుతున్నారని, విత్తనాలు నాటిన వెంటనే అభివృద్ది ఫలాలు అందాలంటే ఎలా? అన్నారు.

హైదరాబాద్ లో ఐటీ హబ్ గా మారడానికి సమయం పట్టిందని, మలేషియా నుంచి సింగపూర్ విడిపోయినప్పుడు.. సింగపూర్ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయని, అయితే మలేషియాకు ధీటుగా సింగపూర్ నిలదొక్కుకుందని లోకేష్ పేర్కొన్నారు. చేశారు.

English summary
In recent days TDP leader Nara Lokesh was trying to attract the youth. Today he attended to yuva chaitanya yatra in nellore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X