విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఎక్కడుంటే అక్కడే ఐటీ, జగన్ వ్యాఖ్యలు విడ్డూరం: మంత్రి లోకేష్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావడం లేదన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ శివారులోని గన్నవరం మేధా టవర్స్ లో హెచ్‌సీఎల్, స్టేట్ స్ట్రీట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఐటీ కంపెనీని మంత్రి గురువారం ప్రారంభించారు.

బాబ్లీ కేసు: చంద్రబాబుకు త్వరలో కోర్టు నోటీసులు!, ఏపీ ముందస్తుపై లోకేష్ ఏమన్నారంటే? <br>బాబ్లీ కేసు: చంద్రబాబుకు త్వరలో కోర్టు నోటీసులు!, ఏపీ ముందస్తుపై లోకేష్ ఏమన్నారంటే?

 లక్ష ఐటీ ఉద్యోగాలే టార్గెట్

లక్ష ఐటీ ఉద్యోగాలే టార్గెట్

2019 కల్లా రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో 36 వేల ఐటీ ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు.

చంద్రబాబు ఎక్కడుంటే అక్కడే ఐటీ

చంద్రబాబు ఎక్కడుంటే అక్కడే ఐటీ

చంద్రబాబునాయుడు గతంలో సీఎం గా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందిందని లోకేష్ తెలిపారు. అదే విధంగా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఐటీ రంగం వేళ్ళూనుకుంటోందని తెలిపారు. మేధా టవర్స్ పక్కన మరో భవనం ఐటి కంపెనీల కోసం నిర్మిస్తున్నట్లు చెప్పారు.

పూర్తి సహకారం

పూర్తి సహకారం

ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని నారా లోకేష్ తెలిపారు. కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని లోకేష్ వివరించారు.

 జగన్ వ్యాఖ్యలు విడ్డూరం

జగన్ వ్యాఖ్యలు విడ్డూరం

ఐటీ అభివృద్ధిపై అసెంబ్లీలో ప్రకటించామని... ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి రాకుండా ఐటీ గురించి మాట్లాడితే ఎలాగని లోకేష్ ప్రశ్నించారు. విశాఖలో ఐటి కంపెనీలు లేవని ప్రతిపక్ష నేత జగన్ చెప్పటం విడ్డూరంగా ఉందని అన్నారు. విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు లోకేశ్‌ వివరించారు.

English summary
Andhra Pradesh minister Nara Lokesh takes on at YSRCP president YS Jaganmohan Reddy for industries issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X