వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాటిని చూడండి: పవన్ కళ్యాణ్‌కు లోకేష్ కౌంటర్!, బాబుపై బాలకృష్ణ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు టిడిపి యువనేత నారా లోకేష్ సోమవారం నాడు కౌంటర్ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

నిమ్మకూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు టిడిపి యువనేత నారా లోకేష్ సోమవారం నాడు కౌంటర్ ఇచ్చారు.

కులం, మతం పేరుతో కొందరు కుట్రలు చేస్తున్నారని, వారి కుట్రలను మనం తిప్పికొట్టాలని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

చిరును రోజా తిట్టడంలో వింతేంలేదు, పవన్‌కు అన్నయ్య సపోర్ట్ చేయాలి: నాగబాబుచిరును రోజా తిట్టడంలో వింతేంలేదు, పవన్‌కు అన్నయ్య సపోర్ట్ చేయాలి: నాగబాబు

అలాగే, ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ నిత్యం మాట్లాడుతున్నారు. దీనిపై స్పందిస్తూ.. హోదా ఉన్న రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. హోదాతో పరిశ్రమలు రావన్న విషయం ఈ ర్యాంకులను చూస్తే అర్థమవుతోందన్నారు. తద్వారా హోదా వల్ల ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు.

Nara Lokesh talks about Special Status for AP

ఎన్టీఆర్‌ మనవడిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. బాలయ్య సూచన, ప్రోత్సాహంతోనే తాను నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. బెల్‌ కంపెనీ ఏర్పాటుతో నిమ్మకూరు రూపురేఖలు మారిపోతాయన్నారు.

విభజన తర్వాత రూ.16వేల కోట్ల లోటుతో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని, ఆ లోటు కనిపించకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. డబ్బుల్లేవని చంద్రబాబు ఏనాడు అభివృద్ధి ఆపలేదన్నారు.

ప్రత్యేక హోదా పేరుతో జరుగుతున్న కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. హోదాతో వచ్చే లాభాలన్నీ ప్రత్యేక ప్యాకేజీతో వస్తున్నాయన్నారు. 2017తో ప్రత్యేక హోదా రద్దు చేస్తామని కేంద్రం చెబుతోందని, హోదా ఉన్న రాష్ట్రాలు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో చిట్టచివరి స్థానంలో ఉంటున్నాయన్నారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో రూపాయికి 16 పైసలు మేర ఏపీకే వస్తున్నాయని,హోదా ఉన్న రాష్ట్రాలకు నాలుగు పైసలు మాత్రమే వస్తున్నాయన్నారు.

సోమవారం నాడు నారా లోకేష్, బాలకృష్ణలు నిమ్మకూరులో పర్యటించారు. అక్కడ 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. వారు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా నిమ్మకూరుకు వచ్చారు. కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తా: బాలకృష్ణ

ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు హీరో బాలకృష్ణ ప్రకటించారు. ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని కోరిన బాలయ్య, ఎన్టీఆర్ పై సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాల మేరకే ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారని ప్రశంసించారు.

English summary
Telugudesam Party leader Nara Lokesh on Monday said that Special Status is not useful for Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X