వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర .. కండీషన్స్ అప్లై

|
Google Oneindia TeluguNews

గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టిడిపిని తిరిగి ఏపీలో పుంజుకునేలా చేయడానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నడుం బిగిస్తున్నారా ? పార్టీ శ్రేణుల్లో ఉన్న నిరాశను దూరం చేయడానికి ఆయన రంగంలోకి దిగబోతున్నారు ? అంతేకాదు తన పొలిటికల్ ఇమేజ్ ను పెంచుకోవడానికి, ఇంతకాలం తనపై జరిగిన దుష్ప్రచారానికి చెక్ పెట్టడానికి లోకేష్ సంసిద్ధమవుతున్నారా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది పార్టీ వర్గాల నుండి.

పార్టీ కోసం నేనున్నానని రంగంలోకి దిగుతున్న లోకేష్ .. త్వరలో పాదయాత్ర

పార్టీ కోసం నేనున్నానని రంగంలోకి దిగుతున్న లోకేష్ .. త్వరలో పాదయాత్ర

ఇప్పుడు ఏపీలో ఒకటే హాట్ టాపిక్. టిడిపి ని కాపాడే నాథుడే ఎవరు ? చంద్రబాబుకు బాసటగా నిలిచేది ఎవరు? అని తెగ చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్న నారా లోకేష్ పార్టీ కోసం నేనున్నాను అంటున్నారు.
గత ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టిడిపి ఒకపక్క అధికార పార్టీ దాడులతో , మరోపక్క పార్టీ ఫిరాయింపులతో కుదేలవుతుంది. ఇక టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని కొందరు, ఇక బాలయ్య ఫుల్ టైమ్ రాజకీయాలు చేస్తేనే పార్టీని కాపాడుకోగలరని మరికొందరు ఎవరి ఇష్టారాజ్యంగా వారు చంద్రబాబు తర్వాత టీడీపీని శాసించే నాయకుడు ఎవరు అని చర్చ జరిపారు.

పొలిటికల్ ఇమేజ్ పెంచుకోవటం , పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర

పొలిటికల్ ఇమేజ్ పెంచుకోవటం , పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటమే లక్ష్యంగా లోకేష్ పాదయాత్ర

ఇక ఈ నేపథ్యంలోనే చినబాబు రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ఓటమి ప్రభావంతో నిరాశ, నిస్పృహ లో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటం కోసం నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు. గతంలో 2014లో చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇక ఆ తర్వాత మొన్న జరిగే 2019 ఎన్నికల్లో ప్రజా సంకల్ప యాత్ర చేసి జగన్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు . ఇక ఇప్పుడు చిన బాబు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పొలిటికల్ గా తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు గా, పార్టీని బలోపేతం చేయాలన్న దిశగా లోకేష్ పాదయాత్ర సాగనుంది.

లోకేష్ పాదయాత్రలో షరతులు వర్తిస్తాయి .. అవేమిటంటే

లోకేష్ పాదయాత్రలో షరతులు వర్తిస్తాయి .. అవేమిటంటే

లోకేష్ సాగించే ఈ పాదయాత్రలో షరతులు కూడా వర్తిస్తాయి అని చెబుతున్నారు టిడిపి నాయకులు. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ చేయనున్న పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర గా ఉండబోదని, మధ్య మధ్యలో బ్రేక్ లు ఉంటాయని చెప్తున్నారు. ఈ సమయంలో సుదీర్ఘ పాదయాత్ర అవసరం లేదని, విడతలవారీగా విరామం తీసుకుంటూ పాదయాత్ర సాగిస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఓటమిపాలైన తర్వాత వైసీపీ చేస్తున్న ఎదురు దాడిని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగిన లోకేష్ బాబు ట్విట్టర్ వేదికగా వైసీపీ పై ఎదురు దాడి చేస్తున్నాడు. అయితే అదంతా ఎవరితోనో రాయించి పెడుతున్న ట్వీట్ లు అని వైసీపీ నేతలు లోకేష్ ను ఇరకాటంలో పెడుతున్నారు. సరిగా మాట్లాడలేడని, పప్పు అని లోకేష్ పై ప్రచారం చేసి లోకేష్ ను ఒక అసమర్థుడిగా చిత్రీకరించే ప్రయత్నం లో బాగానే సక్సెస్ అయ్యారు వైసిపి నేతలు. అయితే ఆ ప్రచారానికి చెక్ పెడుతూ, ప్రజలతో మమేకమవుతూ, పార్టీ శ్రేణులకు ధైర్యం చెబుతూ లోకేష్ త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నారు.లోకేష్ పాదయాత్రలో ఏ మేరకు సక్సెస్ అవుతారో ? ప్రజాభిమానాన్ని ఏ మేరకు చూరగొంటారో వేచి చూడాల్సిందే.

English summary
The recent defeat of TDP in the election of 2019 has disappointed the party. Some of the senior TDP leaders have left the party and joined BJP. Some more are mulling to join other parties. TDP National General Secretary Nara Lokesh is likely to launch a Padayatra in a phased manner. It is learned that Nara Lokesh is likely to enhance his image on his political aspect. At a time, when the spirit and morale of TDP are degrading and people wishing for Jr NTR to lead the party and Balakrishna to go for a full-time politician, Nara Lokesh is learned to have planned to enhance the image of party cadre. Nara Lokesh is likely to launch a Padayatra either district wise or constituency-wise with breaks in between.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X