నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జనచైతన్య యాత్రతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన నెల్లూరు కు చేరుకున్నారు. నెల్లూరు లో జరిగే యవభేరి కి హాజరవుతున్న లోకేష్‌కు టిడిపి నేతలు స్వాగతం పలికారు. లోకేష్‌ను స్థానిక నేతలు గజమాలతో సత్కరించారు. నేతలు, కార్యకర్తలు ఆయనకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. స్థానిక మినర్వా హోటల్ నుంచి జిల్లా టీడీపీ కార్యాలయం వరకు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు టిడిపి నేతలు పోటీపడ్డారు.












Click it and Unblock the Notifications