వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్వంగా ఉంది: పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ నారా లోకేష్ ట్వీట్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పెళ్లి రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు తన తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడికి, భువనేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. నమ్మకం, త్యాగం అనే పునాదులపై వారి వివాహ బంధం నిర్మితమైందని ప్రశంసించారు.

ఇంత గొప్ప తల్లిదండ్రులను పొందినందుకు తనకు గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు, భువనేశ్వరిల పెళ్లినాటి ఫొటను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తన పెళ్లి రోజు తోటపల్లి రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేశానని నారా చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా బహిరంగ సభలో చెప్పారు.

Nara Lokesh tweets congratulating his parents

ఆ తర్వాత వెంటనే నారా లోకేష్ తన తల్లిదండ్రులకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ సినీ నటుడు, తెలుగదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు.

తన వివాహం జరిగినప్పుడు చంద్రబాబు స్వర్గీయ టి. అంజయ్య ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. 1980లో వారి వివాహం జరిగింది. 1978లో చంద్రబాబు తొలిసారి 28 ఏళ్ల వయస్సులో ఎన్నికయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు వరాల వర్షం

పశ్చిమగోదావరి జిల్లాపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాలజల్లు కురిపించారు. భీమవరంలో ఆక్వా యూనివర్శిటీ, ద్వారకా తిరుమలలో నర్సింగ్‌ కాలేజ్‌, గోపాల్‌పురంలో జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో విర్డ్‌ ఆస్పత్రిని ఆయన గురువారం ప్రారంభించారు.

విర్డ్‌ ఆస్పత్రికి టీటీడీ నిధులు కేటాయిస్తామని ఆయన చెప్పారు. ద్వారకా తిరుమలలో 17 వేల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేసి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నయుడు వెల్లడించారు. అంతకుముందు ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

English summary
Telugu Desam leader Nara Lokesh congratulated his parents Nara Chandrababu Naidu and Bhuvaneswari on the wedding day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X