వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరవర రావుకు మెరుగైన వైద్యం అందించండి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌కు లోకేశ్ వినతి..

|
Google Oneindia TeluguNews

ప్రముఖ కవి, విప్లవ రచయితల సంఘం నేత వరవర రావు ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని సర్ జేజే ఆస్పత్రిలో చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వరవర రావుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు ట్విట్టర్‌లో విన్నవించారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆయనను ఇటీవల ఆస్పత్రికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మెరుగైన వైద్యం అందజేయాలని లోకేశ్ మహారాష్ట్ర సీఎం థాకరేను కోరారు.

ప్రధాని మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణల కింద 2018లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని అతని భార్య హేమలత పదే పదే ప్రస్తావించారు. ప్రొఫెసర్ హరగోపాల్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు. ఇటీవల సీఎం జోక్యం చేసుకోవాలంని హరగోపాల్ లేఖ కూడా రాశారు.

nara lokesh urge to maharashtra cm for vara vara rao better treatment

Recommended Video

COVID 19 మృతుల అంత్యక్రియలకు రూ. 15వేలు, Quarantine కేంద్రాల్లో మెరుగైన సేవలు : AP CM Jagan

వరవర రావు ఆరోగ్యం విషమించడంతో హుటాహుటిన జేజే ఆసుపత్రికి తరలించారు. సరిగ్గా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారని వరవర రావు భార్య హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆమె వీడియో కాల్ కూడా మాట్లాడారు. ఆ సమయంలో భర్త పరిస్థితిని చూసి ఆందోళన చెందారు. హేమలత, హరగోపాల్ విన్నవించడంతో.. వరవర రావును జేజే ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

English summary
nara lokesh urge to maharashtra cm uddhav thackeray for vara vara rao better treatment in jj hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X