విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో కత్తి తిప్పిన లోకేశ్: ఆస్తులు వెల్లడించాలంటూ జగన్‌‌కు సవాల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ దమ్ముంటే ఆస్తుల వివరాలను వెల్లడించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. విశాఖపట్నం జిల్లా పార్టీ స్థితిగతులను సమీక్షించేందుకు బుధవారం అయన ఇక్కడికి వచ్చారు.

ఈ సందర్భంగా జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలతో సమావేశమయ్యారు. అనంతరం భారీ కాన్వాయ్ వెంట రాగా ఆయన నగరంలో తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

Nara Lokesh Visits Visakhapatnam And Lays Foundation Stone For New Party Office

తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్తేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. తన తాత ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఏడాదిలోనే అధికారంలోనకి వచ్చి చరిత్ర సృష్టించిందని అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి పార్టీ రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసిందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీకి సొంత పత్రిక, టీవీ చానెళ్లు లేవని...54 లక్షల మంది కార్యకర్తల బలం ఉందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుర్రాడిలా కష్టపడుతున్నారని అన్నారు. చంద్రబాబు మనువడితో కూడా గడపలేకపోతున్నారని లోకేష్‌ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే విశాఖ పర్యటనకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత భారీ కాన్వాయ్ వెంట రాగా ఆయన నగరంలో పార్టీ కొత్త కార్యాలయం ఏర్పాటు చేసే ప్రదేశానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కిన లోకేశ్‌ తలకు తలపాగా చుట్టి విశాఖ టీడీపీ నేతలు కత్తిని అందించారు. తలకు తలపాగా చుట్టుకున్న నారా లోకేశ్ పార్టీ కార్యకర్తలు అందించిన కత్తిని పట్టుకుని గాల్లోకి తిప్పారు.

త్వరలో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జీవీఎంసీ)కి జరగనున్న ఎన్నికల నేపథ్యంలోనే లోకేశ్ విశాఖ పర్యటనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
Nara Lokesh Visits Visakhapatnam And Lays Foundation Stone For New Party Office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X