వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంది అవార్డ్, మరో ఆసక్తికరం: జూ ఎన్టీఆర్‌ను పక్కనపెట్టిన లోకేష్! కావాలనే చేశారా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన వివాదాస్పదం అయింది. ఓ వర్గానికి, తమ వారికే ఈ అవార్డులు ఇచ్చారంటూ ఇతర సినీ ప్రముఖులు ఆగ్రహం, ఆవేద వెళ్లగక్కుతున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ప్రకటన వివాదాస్పదం అయింది. ఓ వర్గానికి, తమ వారికే ఈ అవార్డులు ఇచ్చారంటూ ఇతర సినీ ప్రముఖులు ఆగ్రహం, ఆవేద వెళ్లగక్కుతున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది.

అవార్డుల వివాదం: ప్రశ్నించినందుకు 'నంది' ఇవ్వలేదా, బాబు-బాలయ్యలపై 'కమ్మ' వివాదంఅవార్డుల వివాదం: ప్రశ్నించినందుకు 'నంది' ఇవ్వలేదా, బాబు-బాలయ్యలపై 'కమ్మ' వివాదం

ఇప్పటికే నంది అవార్డులపై రగడ

ఇప్పటికే నంది అవార్డులపై రగడ

నంది అవార్డుల ప్రకటన వెనుక బాలకృష్ణ ఉన్నారని, అందుకే లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు వచ్చాయని విమర్శలు వస్తున్నాయి. లెజెండ్ సినిమాకు అన్ని అవార్డులు రావడం, రుద్రమదేవి, రేసుగుర్రం సినిమాలకు అవార్డులు రాకపోవడం పైనే పరిశ్రమలో చర్చ సాగుతోంది.

నారా లోకేష్ శుభాకాంక్షలపై ఆసక్తికర చర్చ

నారా లోకేష్ శుభాకాంక్షలపై ఆసక్తికర చర్చ


ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ లీడర్, ఐటీ మంత్రి నారా లోకేష్‌కు చెందిన ఓ ట్వీట్ పైన కూడా చర్చ సాగుతోంది. అవార్డుల ప్రకటన రోజునే ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో, బయట ఆసక్తికర చర్చ సాగుతోంది.

లోకేష్ శుభాకాంక్షలు ఇలా

లోకేష్ శుభాకాంక్షలు ఇలా

అందుకు కారణం కూడా ఉంది. ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులు ప్రకటించింది. లోకేష్ నంది అవార్డు విన్నర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కానీ 2014, 2015 నంది అవార్డు విన్నర్లకు, అలాగే 2015, 2016 ఎన్టీఆర్ నేషనల్ అవార్డు విన్నర్లకు ఆయన శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారింది.

జూ ఎన్టీఆర్‌కు నంది వచ్చింది కానీ

జూ ఎన్టీఆర్‌కు నంది వచ్చింది కానీ

లోకేష్ కేవలం 2014, 2015 నంది అవార్డు విన్నర్లకే శుభాకాంక్షలు తెలపడం వెనుక నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు 2016కి నంది అవార్డు రావడం కారణం కావొచ్చుననే చర్చ సాగుతోంది.

ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలపడం ఇష్టం లేకేనా

ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలపడం ఇష్టం లేకేనా


2016లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారెజ్ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు ఆరు అవార్డులు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడి అవార్డు ప్రకటించారు. దీంతో ఉద్దేశ్యపూర్వకంగానే ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలపడం ఇష్టం లేక లోకేష్ అలా ట్వీట్ చేశారా అనే చర్చ సాగుతోంది.

తాజాగా, ఘాటుగా స్పందించిన లోకేష్

తాజాగా, నంది అవార్డుల అంశం వివాదాస్పదం కావడంపై కూడా లోకేష్ ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్, ఓటరు కార్డు లేని వారు కూడా ప్రత్యేక హోదా, నంది అవార్డులపై విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నంది అవార్డుల ప్రకటనపై విమర్శలు వస్తుండటంపై సీఎం చంద్రబాబు బాధపడ్డారన్నారు. అవార్డులపై విమర్శలు చేస్తోంది ఇద్దరు ముగ్గురేనని, హైదరాబాదులో కూర్చొని ఏం చేయాలో చెప్పడం కాదన్నారు.

English summary
AP Minister and TDP leader Nara Lokesh has tweeted about the Nandi Award winners, withing only the 2014 and 2015 winners, strangely avoiding the winners of 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X