వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారా రోహిత్ జోస్యం .. జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారట

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2018 : నారా రోహిత్ జోస్యం.. జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారట!! || Oneindia

కొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉన్న నేపధ్యంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈసారి విజయం సాధించటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీడీపీ జాతీయ నేతలతో, స్టార్ క్యాంపెయినర్లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది . ఇక స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగిన నారావారి హీరో నారా రోహిత్ చివరి రోజు ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు . వైసీపీకి ఓటు వేస్తే నీళ్లులేని బావిలో దూకినట్లేనని చెప్పుకొచ్చారు.

Nara Rohith prediction.. jagan will merge the YCP with BJP

మూడు దుష్ట శక్తులు కలిశాయి . అయినా టీడీపీదే విజయం

ఏపీని అభివృద్ధిలో ముందుంచే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని స్టార్ క్యాంపెయినర్ సినీ హీరో నారా రోహిత్ అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె, ఎన్టీఆర్‌ సర్కిల్‌, బెంగళూరు బస్టాండు వద్ద వచ్చిన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడిన రోహిత్.. బీజేపీ , వైసీపీ , టీఆర్ఎస్ పార్టీలను దుష్ట శక్తులుగా అభివర్ణించారు. చంద్రబాబు విజయం అడ్డుకోవాలని చూస్తున్న మూడు దుష్టశక్తులు ఏకమయ్యాయని, అయినా వారు ఏమీ చెయ్యలేరని రోహిత్ పేర్కొన్నారు . రాష్ట్రం విడిపోయాక ఒకవైపు రాజధాని నిర్మాణం చేస్తూ మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన చంద్రబాబు ప్రజల మన్ననలు పొందారని అన్నారు నారా రోహిత్ .

<strong>పవన్ వ్యాఖ్యలకు ఆలీ కౌంటర్ .. పవన్ కు పలు ప్రశ్నలను సంధించిన ఆలీ </strong>పవన్ వ్యాఖ్యలకు ఆలీ కౌంటర్ .. పవన్ కు పలు ప్రశ్నలను సంధించిన ఆలీ

జగన్ కేసుల మాఫీ కోసం బీజేపీలో వైసీపీ కలిసిపోతుందన్న నారా రోహిత్

ఇక సాయంత్రంతో ప్రచారం ముగియనున్న నేపధ్యంలో ఆయన చివరి రోజు కోడా సంచలన వ్యాఖ్యలే చేశారు . ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ నేరుగా బీజేపీతో కలిసిపోతుందని నారా రోహిత్ జోస్యం చెప్పారు. తనపై ఉన్న 32కేసులు మాఫీ చేసుకునేందుకు బీజేపీతో దోస్తీ చేసుకుంటున్నారని రోహిత్ ఆరోపించారు. మొత్తానికి అటు నారా వారి కుటుంబం కూడా ఈ సారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. మరి ప్రజల తీర్పు మరి కొన్ని గంటల్లో ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.

English summary
Star Campaigner film star Nara Rohit said that the Telugu Desam Party would be in the forefront of the development of the AP. Speaking to people in Chittur district, Rohit spoke of BJP, YCP and TRS parties as evil powers. Rohit has said that the three bad guys who are trying to stop Chandrababu's success, but they can not do anything and jagan will merge the YCP with BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X