వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆది పశువులా, పిచ్చికుక్కను కొట్టినట్లు కొడ్తాం: నారమల్లి పద్మజ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంతలో పశువులా అమ్ముడుపోయిన ఆదినారాయణ రెడ్డికి తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదని అన్నార.

చంద్రబాబు వేసిన బిస్కట్‌కు అమ్ముడుపోయి, జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడితే రోడ్డు మీద పిచ్చికుక్కను కొట్టినట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆమె వ్యాఖ్యానంచించారు ఆమె శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

 చంద్రబాబు మంత్రులను ఉసిగొల్పుతూ...

చంద్రబాబు మంత్రులను ఉసిగొల్పుతూ...

చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆంబోతుల్లాంటి మంత్రులను ఉసిగొల్పి వైయస్ జగన్‌పై ఆరోపణలు చేయిస్తున్నారని పద్మజ అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు నాలుగేళ్లుగా ఏం చేశాడో చెప్పే ధైర్యం లేక ప్రతిపక్షంపై ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేస్తున్నారని అన్నారు.

 యాత్రకు ఆదరణను చూసి...

యాత్రకు ఆదరణను చూసి...

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణను చూసి టిడిపి నేతలు భయపడుతున్నారని పద్మజ అన్నారు. మాట తప్పడం, వెన్నుపోటు పొడవడం, అవినీతికి పాల్పడే చంద్రబాబు పంచన తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నాయకులు చేరి దొంగ స్వామీజీల్లా మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని అన్నారు.

ఆదికి ధైర్యం లేక

ఆదికి ధైర్యం లేక

పార్టీ ఫిరాయించి రాజీనామా చేసే ధైర్యం లేని ఆదినారాయణ రెడ్డి సచివాలయం సాక్షిగా మీడియా సమావేశం ఏర్పాటు చిస రామసుబ్బారెడ్డి, తాను చెరో 50 శాత వాటాలు పంచుకుంటున్నట్లు చెప్పడం సిగ్గుచేటు అని పద్మజ అన్నారు. కేశవరెడ్డి విద్యాసంస్థల ద్వారా రూ.80 కోట్ల స్కాం జరిగితే దాని నుంచి తప్పించుకోవడానికి ఆదినారాయణ రెడ్డి పార్టీ ఫిరాయించిన సంగతి అందరికీ తెలుసునని అన్నారు.

ఆది దొంగనా, దొరనా....

ఆది దొంగనా, దొరనా....

ఇంతకీ ఆదినారాయణ రెడ్డి దొంగనా, దొరనా అని పద్మజ ప్రశ్నించారు. చంద్రబాబుకు, జగన్‌కు నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. వంద ఏళ్ల కాంగ్రెసును ఎదిరించి ప్రత్యేక పార్టీ పెట్టి 67 మంది ఎమ్మెల్యేలన గెలిపించుకున్న గుండె ధైర్యం గల నాయకుడు జగన్ అని ఆమె అన్నారు.

English summary
The YSR Congress party leader Naramalli Padmaja retaliated Andhra Pradesh minister Adinarayana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X