వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యాచారం చేస్తూ రికార్డుచేశారు, భర్త ముందే అలా..భర్త ఏంచేశాడంటే?

ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా, ఆ దృశ్యాలను సెల్ ఫోన్లలో రికార్డు చేసి వేధించిన ఇద్దరు యువకులకు నరసరావుపేట లోని 13వ, అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి కోర్టు 20 ఏళ్ళ జైలు శిక్ష .

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు:వివాహితపై లైంగిక దాడికి పాల్పడడమే కాదు , ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించిన ఇద్దరు యువకులకు గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని 13వ, అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి తీర్పునిచ్చారు.

2014 డిసెంబర్ ఐదవ తేదిన యడ్లపాడులోని దళితవాడకు చెందిన ఓ వివాహిత పిబిసి కెనాల్ లో దుస్తులు ఉతికేందుకు వెళ్ళింది.

దుస్తులు ఉతికిన తర్వాతే పక్కనే ఉన్న పత్తిపొలంలోకి బహిర్భూమికి ఆమె వెళ్ళింది. అయితే అదే సమయంలో అదే కాలనీకి చెందిన కారుచోల అంకమ్మరావు, కారుచోల మహేంద్రలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఆమెపై అత్యాచారానికి పాల్పడుతుండగా సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో పాటు దళితవాడకు చెందిన కొంతమంది యువకుల సెల్ ఫోన్లకు ఆ వీడియోలను పంపారు. అంతేకాదు సదరు యువకులు కూడ ఆమెను వేధించడం ప్రారంభించారు.

narasaraopeta court ordered to 20 years jail for convicts

ఈ వేధింపులను తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్ళింది. రెండు నెలల తర్వాత ఆమె భర్త వద్దకు తిరిగి వచ్చింది. 2015 ఫిబ్రవరి 18న, కొందరు యువకులు ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు.

ఇది గమనించిన భర్త ఆ యువకులతో గొడవపడ్డాడు. వాని వద్ద ఉన్న సెల్ ఫోన్లను లాక్కొని పరిశీలించాడు. తన భార్య పై లైంగిక దాడికి పాల్పడిన దృశ్యాలను సెల్ ఫోన్ లో గుర్తించాడు.

దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేశారు. ఇద్దరు యువకలుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అయితే కారుచోల అంకమ్మ రావుకు 20 ఏళ్ళ జైలు శిక్ష, రూ . లక్ష రూపాయాల జరిమానా, మహేంద్రకు 20 ఏళ్ళ జైలు శిక్ష రూ.50 వేల జరిమానాను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

English summary
narasaraopeta court ordered to 20 years jail for convicts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X