వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కంటే ఆ టీడీపీ నేత ఆస్థులే ఎక్కువ !? నాగబాబు , పీవీపీ ఆస్థుల చిట్టాకూడా ఇక్కడ చూడండి

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : జగన్ కంటే ఆ టీడీపీ నేత ఆస్థులే ఎక్కువ ? | Oneindia Telugu

ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ నేత‌ల ఆస్తుల చిట్టాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు టిడిపి అధినేత చంద్ర‌బాబు.. వైసిపి అధినేత జ‌గ‌న్ ఆస్తుల వివ‌రాల మీదే చ‌ర్చ జ‌రిగింది. అయితే, తాజాగా నామినేష‌న్ల దాఖ‌లు స‌మ‌యంలో ఆస్తు లు..అప్పుల వివ‌రాల‌ను అభ్య‌ర్దులు వెల్ల‌డిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఆస్తుల పైనే టిడిపి నేత‌లు ఎక్కువ‌గా స్పం దిస్తూ వ‌స్తున్నారు. అయితే, తాజా లెక్క‌ల ప్ర‌కారం జ‌గ‌న్ ఆస్తుల కంటే..మంత్రి నారాయ‌ణ ఆస్తుల విలువ రెట్టింపు స్థాయి లో ఉంది.

జ‌గ‌న్ కంటే నారాయణ ఆస్తులే..

జ‌గ‌న్ కంటే నారాయణ ఆస్తులే..

వైసిపి అధినేత అక్ర‌మ సంపాద‌న‌..ఆస్తులు అంటూ టిడిపి నేత‌ల ఆరోప‌ణ‌లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అయితే, తా జాగా..వైసిపి అధినేత త‌న నామినేష‌న్ లో ఆస్తులు..అప్పుల వివరాలు వెల్ల‌డించారు. దీని ప్ర‌కారం జ‌గ‌న్ పేరిట ఉన్న
స్థూల ఆస్తులు 339.89 కోట్లు. కాగా, మంత్రి నారాయ‌ణ ఆస్తులు రూ. 668 కోట్లు గా నామినేష‌న్ లో పేర్కొన్నారు. కాగా, వివి ధ సంస్థ‌ల నుండి తీసుకున్న రుణాలు రూ.201.28 కోట్లుగా వెల్ల‌డించారు.

చంద్ర‌బాబు ఆస్తులు 20 కోట్లు..

చంద్ర‌బాబు ఆస్తులు 20 కోట్లు..

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తరఫున కుప్పంలో నామినేషన్‌ దాఖలైంది. అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల లె క్క‌ల ప్ర‌కారం చంద్రబాబు పేరిట ఉన్న మొత్తం ఆస్తులు: రూ.20,44,33,814 కాగా, చ‌రాస్థులు .. రూ.47,38,067 గా అఫిడ విట్‌లో వెల్ల‌డించారు.

అక్ర‌మ‌ అరెస్ట్‌లు జ‌రుగుతాయి: ఎన్నిక‌లు మీరే చేయాలి: ప‌వ‌న్ కు బాబు డ‌బ్బులు : జ‌గ‌న్ ..!అక్ర‌మ‌ అరెస్ట్‌లు జ‌రుగుతాయి: ఎన్నిక‌లు మీరే చేయాలి: ప‌వ‌న్ కు బాబు డ‌బ్బులు : జ‌గ‌న్ ..!

నాగబాబు ఆస్తులు 41 కోట్లు..

నాగబాబు ఆస్తులు 41 కోట్లు..

కొణిదెల నాగేంద్రబాబు నరసాపురం పార్లమెంట్‌ స్థానానికి జనసేన అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అఫిడివిట్‌లో తను, తన భార్య పేరిట ఉన్న ఆస్తులు రూ. 41 కోట్లుగా చూపించారు. చరాస్థులు రూ. 36,73,50,772 , స్థిరాస్థులు రూ. 4,22,74,477 చూపించారు. అదే విధంగా అప్పులు రూ. 2,70,49,798గా పేర్కొన్నారు.

పివిపి ఆస్తుల వివ‌రాలు ఇలా..

పివిపి ఆస్తుల వివ‌రాలు ఇలా..

విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పొట్లూరి వర ప్రసాద్‌(పీవీపీ) కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ. 347.75కోట్లుగా ప్రకటించారు. వీటిలో చరాస్తులు రూ.236.29కోట్లు, స్థిరాస్తులు రూ.111.46కోట్లు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేసిన పీవీపీ.. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాల ను వెల్లడించారు. కుటుంబానికి ఉన్న అప్పులు రూ.20.95 కోట్లుగా చూపించారు.

కేశినేని నాని ఆస్తి 80 కోట్లు..

కేశినేని నాని ఆస్తి 80 కోట్లు..

తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌(నాని) దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.80.82 కోట్లుగా చూపించారు. నాని పేరుతో అప్పులు రూ.51.23 కోట్లున్నాయి. మరో రూ.23.29 కోట్ల వివాదాస్పద బకాయిలు సైతం ఉన్నట్టు పొందుపరిచారు.

English summary
Minister Narayana Assets is higher than jagan assets. Nagababu assets value of 41 cr. PVP assets value of 347 cr. in nominat ions contesting candidates announced their assets details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X