హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిక్కులు తెచ్చిన సీఎం: జగన్‌కు ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చి కొత్త చిక్కులు తెచ్చుకున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ ర్యాంకులకు సరైన ప్రాతిపదిక లేదని ఇప్పటికే చంద్రబాబు తేల్చి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే, అనధికారికంగా అయినా ర్యాంకులు బయటకు రావడంతో చంద్రబాబుకు కొత్త చిక్కులు వచ్చినట్లేనని అంటున్నారు. ర్యాంకుల పైన ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొందరు మంత్రులు మనస్తాపం చెందారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో స్వయంగా మాట్లాడారని కూడా తెలుస్తోంది. ర్యాంకుల పైన వివరణ ఇచ్చారని సమాచారం. ర్యాంకుల విషయంలో మంత్రి పీతల సుజాత వంటి వారికి మొదటి స్థానం దక్కింది. పీ నారాయణ వంటి వారికి చివరి స్థానం దక్కింది.చివరలో ఉన్న మంత్రులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని అంటున్నారు.

Narayana at the bottom of Chandrababu's ranking

వీరి మనస్తాపానికి తోడు, చంద్రబాబు మరో చిక్కు కూడా తెచ్చుకున్నారని అంటున్నారు. ర్యాంకుల ద్వారా ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్.. తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారని అంటున్నారు.

ఇప్పటికే ఆయా జిల్లాల్లో వైసిపి నేతలు మంత్రులను, ఎమ్మెల్యేలను స్థానికంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు స్వయంగా చంద్రబాబు ర్యాంకుల్లో వారు చివరి స్థానాల్లో ఉండటాన్ని.. వైసిపి నేతలు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి వేసిన మార్కుల విషయంలోనే మా మంత్రి చివరి స్థానంలో ఉన్నారని వైసిపి నేతలు మరింత బలంగా వారిపై విమర్శలు చేసేందుకు ఆస్కారం ఏర్పడిందని అంటున్నారు. ర్యాంకుల వల్ల చంద్రబాబు సొంత పార్టీ నేతలను చిక్కుల్లో పెట్టారని అంటున్నారు.

మరోవైపు, జాతీయస్థాయిలో అత్యుత్త పనితీరు కనబరిచినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అవార్డు అందుకోబోతుంటే, మరి రాష్ట్రస్థాయిలో అయ్యన్నపాత్రుడికి పదో ర్యాంకు రావడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ర్యాంకుల విషయం టిడిపికి ఎన్ని కొత్త చిక్కులు తెస్తుందోనని అంటున్నారు.

ఇదిలా ఉండగా, అనంతరం మంగళవారం మధ్యాహ్నం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. సీఎం ర్యాంకులను పాజిటివ్‌గా తీసుకుంటామని, లోపాలను సరి చేసుకుంటామని చెప్పారు. ర్యాంకుల పైన సంతృప్తిగా ఉన్నామన్నారు. అంతకుముందు నారాయణ తనకు 18వ ర్యాంకు వచ్చిందన్న వార్తలను కొట్టిపారేశారు.

English summary
Minister Narayana at the bottom of Chief Minister Chandrababu's ranking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X