హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లైఫ్‌లో స్పీడ్ ఉండాలనేవాడు.. అంతే స్పీడ్‌గా వెళ్లిపోయాడు(నిషిత్ ఫోటోలు)

అడ్మిషన్స్ హడావుడి పూర్తవగానే సింగపూర్ వెళ్లి రావాలని నిషిత్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇంతలోనే అనుకోని ఘటనతో కుటుంబంలో విషాదం మిగిల్చిపోయాడు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు నారాయణ విద్యాసంస్థల సిబ్బందిని కూడా తీవ్రంగా కలచివేసింది. నిషిత్ దుర్మరణం నేపథ్యంలో.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న వయసులోనే డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నిషిత్.. ఎంతవరకు రాణించగలడని తొలుత చాలామంది అనుమానాలు వ్యక్తం చేసినా.. ఆ తర్వాత ఆయన పనితీరు చూసి తండ్రికి తగ్గ తనయుడు అనుకున్నారు. డైరెక్టర్ గా చురుగ్గా వ్యవహరిస్తున్న సమయంలోనే ఆయన దుర్మరణం పాలవడం విద్యా సంస్థల సిబ్బందిని ఆవేదనకు గురిచేస్తోంది.

ఎంత బిజీగా ఉన్నా:

ఎంత బిజీగా ఉన్నా:

డైరెక్టర్ గా ఎంత బిజీగా ఉన్నా.. స్నేహితులను మాత్రం నిషిత్ ఏమాత్రం నిర్లక్ష్యం చేసేవాడు కాదు. వీలు చిక్కినప్పుడల్లా స్నేహితులతో అతను సమయం గడిపేవాడని ఫేస్ బుక్ ప్రొఫైల్ చూస్తే తెలిసిపోతోంది. ఎప్పుడూ స్నేహితులతో ఫోన్ టచ్ లో ఉండేవాడని తెలుస్తోంది.

కుర్రాడికి బాధ్యత ఏంటనుకున్నారు?:

కుర్రాడికి బాధ్యత ఏంటనుకున్నారు?:

నిషిత్(22)కి నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించినప్పుడు.. ఇంత చిన్న వయసులో ఎలా మేనేజ్ చేస్తాడా? అని అంతా అనుమానపడ్డారు. అయితే వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ నిషిత్ రాణించారు. అందరిని కలుపుకుపోయే తత్వం ఆయన్ను అందరికి దగ్గర చేసింది.

డైరెక్టర్ సార్ ఇక లేరు:

డైరెక్టర్ సార్ ఇక లేరు:

తమ డైరెక్టర్ మరణించడంతో.. డైరెక్టర్ సార్ ఇక కనిపించడంటూ పలువురు నారాయణ సిబ్బంది కంటతడి పెట్టుకున్నారు. అంత్యక్రియల సందర్భంగా స్నేహితులు, నారాయణ ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. నారాయణకు తగిన వారసుడిగా పేరు తెచ్చుకున్న నిషిత్ మరణం.. నారాయణ విద్యా సంస్థలకు కూడా లోటుగానే మారనుంది.

అడ్మిషన్ల వ్యవహారంలో బిజీగా:

అడ్మిషన్ల వ్యవహారంలో బిజీగా:

ఇంటర్ పరీక్షలు పూర్తయిపోవడంతో నారాయణ అడ్మిషన్ల విషయంలో నిషిత్ బిజి బిజీగా గడుపుతున్నారు. ప్రతీరోజు ఆయా కళాశాల బ్రాంచ్ లకు వెళ్లి స్వయంగా అడ్మిషన్స్ వివరాలు తెలుసుకుంటున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కళాశాల్లోనే అడ్మిషన్స్ పై సమావేశాలు నిర్వహిస్తున్నారు.

లైఫ్ లో స్పీడ్ ఉండాలన్నాడు:

లైఫ్ లో స్పీడ్ ఉండాలన్నాడు:

అడ్మిషన్స్ హడావుడి పూర్తవగానే సింగపూర్ వెళ్లి రావాలని నిషిత్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇంతలోనే అనుకోని ఘటనతో కుటుంబంలో విషాదం మిగిల్చిపోయాడు. ఎప్పుడూ లైఫ్ లో స్పీడ్ ఉండాలంటూ చెప్పే నిషిత్.. తక్కువ సమయంలోనే ఎదిగి అంతే త్వరగా దూరమైపోయారని నారాయణ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Narayana employees expressed their condolense for Nishit Narayana's death in accident. Funeral was held in Nellore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X