వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"చంద్రబాబు జుట్టు కేంద్రం చేతిలో, గందరగోళంలో పవన్ కల్యాణ్"

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై/ ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

Recommended Video

BJP Plans To Join Hands With Jagan, Ignoring Chandrababu

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్సి రామకృష్ణ మండిపడ్డారు మంగళవారంనాడు ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఐదు కోట్ల ప్రజలు నిరసిస్తన్నారన ఆయన అన్నారు.

 చంద్రబాబు జుట్టు కేంద్రం చేతిలో..

చంద్రబాబు జుట్టు కేంద్రం చేతిలో..

చంద్రబాబు జుట్టు కేంద్రం చేతిలో ఉందని, బిజెపికి మద్దతు ఇచ్చినంత కాలం ఆయన బయటే ఉంటారని నారాయణ మంగళవారం చెన్నైలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒక వేళ వ్యతిరేకిస్తే అవినీతి వ్యవహారాల్లో చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అందుకే ధైర్యం చేయడం లేదని అన్నారు.

పవన్ కల్యాణ్ తీవ్రమైన గందరగోళంలో

పవన్ కల్యాణ్ తీవ్రమైన గందరగోళంలో

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా నారాయణ వ్యాఖ్యలు చేశారు రాజకీయాలపై పవన్ కల్యాణ్కు స్పష్టమైన అవగాహన లేదని, ప్రస్తుత పరిణామాలు అర్థం కాక పవన్ తవ్రమైన గందరగోళంలో ఉన్నారని ఆయన అన్నారు. ఎపిలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ భజన చేస్తూ పవన్ కల్యాణ్ పబ్బం గడుపుకుంటున్నారన వ్యాఖ్యానించారు.

 ఇప్పటి వరకు కూడా...

ఇప్పటి వరకు కూడా...

కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీని కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, చేతకాని దద్దమ్మలైన ఎంపీల వల్లనే కేంద్రం నుంచి రాష్ట్రం ఏమీ సాధించలేకపోతోందని రామకృష్ణ అన్నారు. మన ఎంపీలు ఢిల్లీలో గాంధీజీ బొమ్మ ముందు నిలబడి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం ఇవ్వడమే తప్ప వారి వల్ల ఒరిగిందేమీ లేదని అన్నారు.

బాబు ఇలా అన్నారు..

బాబు ఇలా అన్నారు..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరుగుదొడ్లు కట్టుకోవాలని కోరుతూ శ్రీకాకుళం వెళ్లి ధర్నా చేస్తానని అనడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో డబ్బులు లేవంటూనే రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఎలా ప్రవేశపెడుతారని ఆయన ప్రశ్నించారు.

 అరచేతిలో వైకుంఠం చూపిస్తూ...

అరచేతిలో వైకుంఠం చూపిస్తూ...

అరచేతిలో వైకుంఠం చూపిస్తూ చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని, రాష్ట్రానికి ఇద్దరు నాయుళ్లు అన్యాయం చేశారని రామకృష్ణ అన్నారు. ప్రజల్లో అగ్రహం పెల్లుబుకినప్పుడల్లా దానిపై నీళ్లు చల్లటం తప్ప రాష్,ట్ర నాయకులు మరో పనిచేయడం లేదని ఆయన అన్నారు.

 సోము వీర్రాజుకు మరో పని లేదు

సోము వీర్రాజుకు మరో పని లేదు

బిజెపి నేత సోము వీర్రాజుకు చంద్రబాబును తిట్టడం తప్ప మరో ఎజెండా లేదని రామకృష్ణ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని వర్గాలు ఒక తాటి మీదికి వస్తున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ ఎజెండాకు తగినట్లుగా కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు.

టిడిపి కూడా కలిసి రావాలి...

టిడిపి కూడా కలిసి రావాలి...

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం 8వ తేదీన చేపట్టే బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయని రామకృష్ణ చెప్పారు. కేంద్రం మెడలు వంచేందుకు రాష్ట్ర ప్రయోజనాల కసం తెలుగుదేశం పార్టీ కూడా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని ఆయన సూచించారు.

English summary
CPI leader Narayana made comments against Andhra Pradesh CM Nara Chnadrababu Naidu and Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X