వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమిరెడ్డికి మంత్రి పదవి: నారాయణ హస్తం, అందుకే బాబుకు చెప్పారు!

తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చోటు కల్పించడం వెనుక మంత్రి పొంగూరు నారాయణ హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ

|
Google Oneindia TeluguNews

అమరావతి: తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చోటు కల్పించడం వెనుక మంత్రి పొంగూరు నారాయణ హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.

సీఆర్‌డీఏ, మున్సిపల్‌ శాఖ, చిత్తూరు జిల్లా ఇంఛార్జీ బాధ్యతల నిర్వహణ భారం మోయలేక ఉన్నానని, అందుకే జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబుతో నారాయణ చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో పూర్తి స్థాయిలో పనిచేసే వ్యక్తి, సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే మంత్రిగా అవకాశం ఇవ్వాలని నారాయణ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

కీలక బాధ్యతలు

కీలక బాధ్యతలు

2014 సార్వత్రిక ఎన్నికలు తర్వాత జిల్లా నుం చి మంత్రిగా నారాయణకు చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. రాష్ట్ర పురపాల క, పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా ఎంతో కీలకమైన శాఖను నారాయణకు కేటాయించారు. దీనికితోడు రాజధాని నిర్మాణం, సీఆర్‌డీఏ బాధ్యత తోపాటు చిత్తూరు జిల్లా ఇంఛార్జీ మంత్రిగా నియమించారు. అన్నింటికన్నా రాజధాని అమరావతి నిర్మాణం, సీఆర్‌డీఏ బాధ్యతల్లో నారాయణ తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.

మోయలేని భారం

మోయలేని భారం

తాత్కాలిక భవనాలు, ఇతరత్రా రాజధాని నిర్మాణ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ.. సీఎంకు మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈ కారణాలతో జిల్లాలో ఎక్కువగా పర్యటించలేకపోవడం, కార్య కర్తలతో మమేకమై చర్చించడం వంటి వాటికి నారాయణ దూరమయ్యారని జిల్లా టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే, రానున్న సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే పూర్తి స్థాయిలో మంత్రిగా పని చేసే వారు ఉండాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేశారు. ఇటీవల మంత్రి నారాయణతో సీఎం ఏకాంతంగా చర్చలు జరిపినప్పుడు జిల్లా రాజకీయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ సీఎంకు తన మనసులోని మాటను వెల్లడించినట్లు సమాచారం. సీఆర్‌డీఏ, మున్సిపల్‌ శాఖ, చిత్తూరు జిల్లా ఇంఛార్జీ మంత్రి బాధ్యతలు ఎంతో భారంగా ఉన్నా యని, జిల్లాలో మరో మంత్రికి అవకాశం ఇవ్వాలని సూచన చేశారు.

సోమిరెడ్డి కాక ఇంకెవరు..?

సోమిరెడ్డి కాక ఇంకెవరు..?

ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో ఎవరు సమర్ధవంతంగా పని చేస్తారన్నది సీఎం, నారాయణల మధ్య చర్చ జరిగింది. దీంతో అనూహ్యంగా సోమిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జిల్లాలో సీనియర్‌ నేత, రెడ్డి సామాజిక వర్గం వంటి అంశాలు సోమిరెడ్డికి అనుకూలంగా ఉన్నాయని జిల్లా వ్యవహారాలు సోమిరెడ్డికి అప్పగిస్తే సరిపోతుందని నారాయణ.. సీఎం చంద్రబాబుతో అన్నట్లు సమాచారం. మంత్రిగా పని చేస్తున్న వ్యక్తి జిల్లాకు మరో మంత్రి కావాలని కోరడం అది సీనియర్‌ నేతగా ఉన్న సోమిరెడ్డి పేరు సిఫార్సు చేయడం చర్చనీయాంశంగా మారింది. కానీ మొదట్లో మాత్రం సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు నారాయణే అడ్డుపుల్ల వేస్తున్నారని ప్రచారం సాగింది. ప్రస్తుత నిర్ణయంతో ఇదంతా ఒట్టిదేనని తేలిపోయిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

జిల్లా వ్యవహరాలు మాత్రం సోమిరెడ్డికి..

జిల్లా వ్యవహరాలు మాత్రం సోమిరెడ్డికి..

కాగా, చిత్తూరు జిల్లా వ్యవ హారాలు పూర్తి స్థాయిలో సోమిరెడ్డికి అప్పగించి.. సీఆర్‌డీఏ, మున్సిపల్‌ శాఖ, చిత్తూరు జిల్లా ఇంఛార్జీ బాధ్యతలను మంత్రి నారాయణ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, రాష్ట్రమంత్రిగా లోకేష్‌లు ఉన్న జిల్లా ఇంఛార్జీగా ఇక మంత్రిగా నారాయణ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సొంత జిల్లాకు సోమిరెడ్డి..

సొంత జిల్లాకు సోమిరెడ్డి..

ఏప్రిల్ 2న రాష్ట్రమంత్రిగా ప్రమాణం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయ శాఖ కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సోమిరెడ్డి ఏప్రిల్ 7న తొలిసారి జిల్లాలో అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పార్టీ నేతలు, కేడర్‌, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ అభినందన సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

English summary
Andhra Pradesh minister Narayana has supported for minister post to MLC Somireddy Chandramohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X