వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి అండగా ఉంటా:మోడీ, రాజీనామాలకు కారణమిదే: సుజనా, ఆశోక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi's Reaction on Ashok Gajapathi Raju, Sujana Chowdary's resign

అమరావతి: ప్రజల సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలని పార్టీ ఆదేశించిందని కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేసినట్టు కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజు ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తమ రాజీనామా పత్రాలను సమర్పించిన తర్వాత సుజనాచౌదరి, ఆశోక్ గజపతిరాజులు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

ఇద్దరు మంత్రులు తమ రాజీనామా పత్రాలను సమర్పించకముందే ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ప్రధానమంత్రి మోడీ ఫోన్‌లో చర్చించారు. కానీ, రాజీనామా విషయంలో వెనక్కు తగ్గలేదు.

సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం

సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం

ఏపీ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేసినట్టు సుజనా చౌదరి చెప్పారు.కేంద్రంలో మంత్రులుగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదని సుజనా చౌదరి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలని పార్టీ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు తాము రాజీనామా చేసుకొన్నట్టు చెప్పారు.

ఏపీకి అండగా ఉంటామని మోడీ చెప్పారు

ఏపీకి అండగా ఉంటామని ప్రధానమంత్రి మోడీ తమకు హమీ ఇచ్చారని సుజనా చౌదరి చెప్పారు. తాము రాజీనామా పత్రాలను సమర్పించేందుకు మోడీ వద్దకు వెళ్ళిన సమయంలో ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించామన్నారు. ఏపీకి అండగా ఉంటామని తమకు మోడీ హమీ ఇచ్చారని సుజనా చెప్పారు.

సరైన సమయంలో బాబు నిర్ణయం

సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీసుకొన్నారని ఆశోక్‌గజపతి రాజు చెప్పారు.ఎన్డీయేలో తాము కొనసాగుతున్నట్టు చెప్పారు. జాతీయ పార్టీలు ఏపీకి ఇచ్చిన హమీని నిలుపుకోలేదని ఆశోక్ గజపతిరాజు చెప్పారు.ఏపీకి కేంద్రం సహకరిస్తోందని కేంద్రప్రభుత్వంలో చేరినట్టు ఆశోక్ గజపతి రాజు చెప్పారు.విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరారు.

పునర్విభజన చట్టం ఎలా ఆమోదం పొందిందో తెలుసు

పునర్విభజన చట్టం ఎలా ఆమోదం పొందిందో తెలుసు

ఏపీ పునర్విభజన చట్టం ఏ రకంగా ఆమోదం పొందిందో తమకు తెలుసునని సుజనా చౌదరి చెప్పారు. ఏపీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశామని చెప్పారు.విభజన హమీల అమలులో జాప్యం జరిగిందని జుజనా చౌదరి చెప్పారు.కేంద్ర మంత్రులుగా కంటే ఎంపీలుగా ఎక్కువగా పోరాటం చేయగలమని సుజనాచౌదరి, ఆశోక్ గజపతిరాజులు చెప్పారు.

English summary
TDP leader sujana chowdary said that Prime minister Narendra Modi assured to us support to ap state.Along with Ashok Gajapathi Raju , sujana chowdary spoke to media on Thursday evening at Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X